లవర్‌ని చంపి.. మృతదేహం తోనే రెండు రోజులు ఆ పని.. అసలు ట్విస్ట్ ఏంటంటే ?
ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే .. ఏమైంది రా.. ఏం జరుగుతోంది రా అనే ప్రశ్నలు సగటు మనిషికి కలగడం సహజమే. ఏ మాయ రోగం వచ్చిందో తెలీదు కానీ మనుషులు మనుషులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా పారు పాల్పడుతున్న కిరాతకపు ఘటనకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి.
ఓ పక్క పెళ్లి అయిన వారు.. మరో పక్క పెళ్లి కాని వారు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా తమ భాగస్వామిని కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను కడతేర్చుతున్న మృగాళ్లు ఓ పక్కన ఉంటే.. మరోవైపు ఇప్పుడు కొత్తగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ ఈ తరహ లోనే ఉన్నా.. కానీ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది.

ఓ వ్యక్తి తన సహజీవన భాగస్వామిని చంపేసి.. రెండు రోజుల పాటు ఆమె మృతదేహం పక్కనే నిద్రపోయాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
భోపాల్‌లోని గాయత్రినగర్ ప్రాంతంలో 32 ఏళ్ల సచిన్ రాజ్‌పుత్.. 29 ఏళ్ల రితికా సేన్ తో లివ్‌ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు. గత మూడున్నరేళ్లుగా లివ్‌ఇన్ లో ఉన్న ఈ జంట మధ్య ఇటీవల కలహాలు తీవ్రంగా మారాయి. రితికా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. సచిన్ నిరుద్యోగిగా ఉన్నాడు. ఆమె తనను పట్టించుకోవడం లేదని, ఆఫీసులో ఇంకెవరినైనా ప్రేమిస్తుందన్న అనుమానంతో అతడు ఆమెను జూన్ 27న గొంతునులిమి హతమార్చాడు.
అయితే హత్య అనంతరం రితిక మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి బెడ్‌పై వేసిన సచిన్.. మృతదేహం పక్కనే తాగుతూ నిద్రపోయినట్టు పోలీసులు వెల్లడించారు. తాను చేసిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేని స్థితిలో తన స్నేహితుడైన అనుజ్‌కు మర్డర్ విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని మొదట అతను నమ్మనప్పటికీ.. సచిన్ పదేపదే చెబుతుండటంతో అనుజ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రితిక మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సచిన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇక్కడ ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. సచిన్‌కు గతంలోనే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. భార్య, పిల్లల్ని వదిలేసి రితికాతో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రస్తుతం రితిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, పోలీసులు హత్యకు గల అసలు కారణాలను మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications