ఆసుపత్రిలో తండ్రి: ఇంటిలో తల్లి, చెల్లిని దారుణంగా కత్తితో చంపేశాడు, చివరికి!
చెన్నై: తండ్రికి సరైన వైద్యం చేయించలేమని జీవితంపై విరక్తి పెంచుకున్న యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఇంటిలో విచక్షణ కొల్పోయిన యువకుడు తల్లి, చెల్లిని దారుణంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడులోని కడలూరు జిల్లా దిండివనంలోని సమ్మై అమ్మళ్ దేవాలయం వీధిలో రాజారాం (45) అనే ఆయన భార్య సుమతి (40), కుమారుడు రంజిత్ (25), కుమార్తె విధ్యాప్రియ (24) నివాసం ఉంటున్నారు.
రాజారాం కడలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. లివర్, కిడ్నీ చెడిపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాజారాం చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం రాజారాం కుటుంబ సభ్యులు ఇప్పటికే చాల అప్పులు చేశారు.

రాజారాంకు లివర్, కిడ్నాలు మార్చాలంటే దాదాపు రూ. 60 లక్షలు ఖర్చు అవుతోందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. అంత డబ్బు సమకూర్చలేని రాజారాం కుటుంబ సభ్యలు విలవిలలాడిపోయారు.
తండ్రికి వైద్యం చేయించలేదని మనం ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అని ఆయన కుమారుడు రంజిత్ నిర్ణయించాడు. శుక్రవారం రాత్రి తల్లి సుమతి, చెల్లి విధ్యాప్రియ నిద్రపోతున్న సమయంలో రంజిత్ కత్తి తీసుకుని ఇద్దరినీ దారుణంగా పోడచి చంపేశాడు.
అనంతరం వైరుతో రంజిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఎంత సేపు అయినా కుటుంబ సభ్యులు ఎవ్వరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసీులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా ఈ విషయం వెలుగు చూసింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications