మూత్ర విసర్జనకు వెళ్లిన మహిళలు, ఫోటోలు తీశారు, ప్రశ్నించినందుకు కొట్టి చంపేశారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: నిర్జనప్రదేశంలో మలమూత్ర విసర్జన చెయ్యడానికి మహిళలు వెళ్లిన సమయంలో కార్పొరేషన్ (పాలికె) అధికారులు ఫోటోలు తీశారు. మీరు ఎందుకు ఫోటోలు తీశారు అంటూ ప్రశ్నించిన వ్యక్తిని కార్పొరేషన్ అధికారులు చితకబాదడంతో అతను మరణించాడు.

సాధ్వీ జై శ్రీ ఎస్కేప్: పెరోల్ లో పై వచ్చి, చక్కగా మసాజ్, బాహుబలి 2 చూసి చెక్కేసిన లేడీ !

రాజస్థాన్ లోని ప్రతాప్ ఘడ్ జిల్లాలోని నగర్ పరిషద్ ప్రాంతంలో ఈ దారుణంగా జరిగిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ప్రతాప్ ఘడ్ జిల్లాలోని నగర్ పరిషద్ ప్రాంతంలో 'స్వచ్చభారత్'అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రతాప్ ఘడ్ పాలికె కమిషనర్ ఆశోక్ జైన్ హాజరైనారు.

మహిళలు వెళ్లారు !

మహిళలు వెళ్లారు !

అశోక్ జైన్ వెంట పాలికె అధికారులు కమల్ హరిజన్, రితేష్ హరిజన్, మనీష్ హరిజన్ తదితరులు ఉన్నారు. ఆ సందర్బంలో స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు సమీపంలోని నిర్జనప్రదేశంలో మలమూత్ర విసర్జన చెయ్యడానికి వెళ్లారు.

మహిళల ఫోటోలు తీశారు !

మహిళల ఫోటోలు తీశారు !

ఆ సమయంలో పాలికె అధికారులు మహిళలు మలమూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలను ఫోటోలు తీశారు. స్థానికంగా నివాసం ఉంటున్న జాఫర్ హుస్సేన్ (44) మీరు ఎందుకు మహిళలు మలమూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ఫోటోలు తీశారు అన్ని ప్రశ్నించాడు.

దుమ్ములేపిన అధికారులు !

దుమ్ములేపిన అధికారులు !

ఆ సందర్బంలో అధికారులు, జాఫర్ షరీఫ్ ల మద్య వాగ్వివాదం జరిగింది. తరువాత సహనం కోల్పోయిన అధికారులు కర్రలు తీసుకుని జాఫర్ షరీఫ్ ను చితకబాదేశారు. తీవ్రగాయాలైన జాఫర్ షరీఫ్ సంఘటనా స్థలంలో నే కుప్పకూలిపోయాడు.

అక్కడే చనిపోయాడు !

అక్కడే చనిపోయాడు !

వెంటనే జాఫర్ షరీఫ్ ను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అతను మరణించాడని స్థానికులు ఆరోపించారు. జాఫర్ షరీఫ్ ను పాలికె అధికారులు కొట్టి చంపేశారని ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అరెస్టు చేస్తారా ? లేదా

అరెస్టు చేస్తారా ? లేదా

నగర్ పరిషద్ కమిషనర్ అశోక్ జైన్, కమల్ హరిజన్, రితీష్ హరిజన్, మనీష్ హరిజన్ తదితరుల మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. వెంటనే పాలికె అధికారులను అరెస్టు చెయ్యాలని లేదంటే జాఫర్ షరీఫ్ మృతదేహం తాము తీసుకోమని మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Zafar Hussein (44) was kicked, punched and beaten to death by municipal council employees at the instigation of Nagar Parishad commissioner Ashok Jain, who ordered to take photographs and videos of women from the Bagwasa Kachi village when they were going to defecate in the open.
Please Wait while comments are loading...