ఒంటరిగావున్న సోదరుడి భార్యపై అత్యాచారం: నిందితుడి అరెస్ట్
కోయంబత్తూరు: తమిళనాడులోని పొల్లాచి సమీపంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 37ఏళ్ల మహిళపై ఆమె భర్త సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి భర్త కొంత కాలం క్రితం చనిపోయాడని పోలీసులు తెలిపారు. కె త్రిమూర్తి(44) అనే నిందితుడు తన తమ్ముడి భార్య అయిన మహిళ ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. మంగళవారం పొల్లాచిలోని అన్ని మహిళా పోలీస్ స్టేషన్లలో బాధితురాలి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు త్రిమూర్తిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పొల్లాచిలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. తదుపరి ఆరోగ్య పరీక్షల కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆమె చేరినట్లు చెప్పారు.
రెండేళ్ల క్రితం బాధితురాలి భర్త చనిపోవడంతో ఆమె తన అత్తగారింటికి సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. తన భర్త చనిపోయినప్పటి నుంచి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.












Click it and Unblock the Notifications