చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ఐ రాజేశ్వరి శ్రమ వృధా: ఆ యువకుడి మృతి

|
Google Oneindia TeluguNews

చెట్టు కొమ్మ పడి తీవ్ర అస్వస్థతకు గురయిన యువకుడు చనిపోయాడు. అతనిని మహిళ ఎస్ఐ రాజేశ్వరి భుజాలపై మోసుకెళ్లారు. సమయానికి ట్రీట్ మెంట్ ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడు. రాజేశ్వరి భుజాన తీసుకెళ్లే వీడియో తెగ వైరల్ అయ్యంది. ఆమెను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఆమె చేసిన శ్రమ వృధా అయిపోయింది. యువకుడు ఉదయ్ చనిపోయాడు.

 ఈదురుగాలులు...

ఈదురుగాలులు...

తమిళనాడులో భారీ వర్షాలు.. దానికి తోడు ఈదురుగాలులతో కరెంట్ స్తంభాలు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఆ సమయంలో ఓ యువకుడు అక్కడ ఉండగా.. ఓ చెట్టు కొమ్మలు అతనిపై పడ్డాయి. దీంతో గాయపడి.. సృహ కూడా కోల్పోయాడు. విషయం తెలిసిన అన్నానగర్ ఎస్ఐ రాజేశ్వరి అతనికి వెంటనే సాయం చేయాలని అనుకున్నారు. తన తోటి సిబ్బంది సాయం చేయగా.. భుజంపై వేసుకున్నారు. అలా వాహనం వద్దకు తీసుకెళ్లి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

 భుజాన వేసుకున్నా..

భుజాన వేసుకున్నా..

రాజేశ్వరితోపాటు మిగతా ఖాకీలు అక్కడే ఉన్నారు. ఆమె యువకుడిని తన భుజాన వేసుకుని ముందుకు నడిచింది. తమ పోలీసు వాహనంలో పడుకునే ప్రయత్నం చేశారు. కానీ వీలు కాలేదు. ఆటోలో అయితే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే ఆటో వద్దకు పరుగుతీసింది. ఆటోలో బెడ్ షీట్ వేశాక.. అతనిని పడుకొబెట్టింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయినా యూజ్ లేదు. ఆ యువకుడు అర్ధాంతరంగా చనిపోయాడు. అందరూ బతుకుతాడని అనుకున్నారు.

12 మంది మృతి

12 మంది మృతి

వర్షాల వల్ల తమిళనాడులో 12 మంది చనిపోయారు. మరోవైపు వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండు దశకు వస్తున్నాయి. దీంతో అధికారులు నీటిని కిందకి వదులుతున్నారు. చెన్నై నగరాన్ని వర్షపు నీరు ముంచెత్తింది. సహాయక చర్యల కోసం 75 వేల మంది పోలీసులు, అధికారులు నిమగ్నం అయ్యారు. లోతట్టు ప్రాంతాలపై ఫోకస్ చేశారు. సీఎం స్టాలిన్ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీచేశారు.

English summary
aravind who was carried on shoulder to a Chennai hospital by a policewoman, died on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X