లేటు వయస్సులో ఆరవ పెళ్ళికి సిద్దం, ముగ్గురు భార్యలు అనుమానాస్పదస్థితిలో మరణించారు

అతను నిత్య పెళ్ళికొడుకు, ఇప్పటికే ఐదుగురిని వివాహం చేసుకొన్నాడు. లేటు వయస్సులో ఆరవ పెళ్ళికి కూడ సిద్దమయ్యాడు రామచంద్ర పటార్ .

రాంచీ:అతను నిత్య పెళ్ళికొడుకు, ఇప్పటికే ఐదుగురిని వివాహం చేసుకొన్నాడు. లేటు వయస్సులో ఆరవ పెళ్ళికి కూడ సిద్దమయ్యాడు రామచంద్ర పటార్ .తాజాగా ఐదో భార్య హత్యకు గురికావడంతో ఆరో పెళ్ళి కోసమే ఆయన ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

జార్ఖండ్ లోని తూర్పు సింగ్ భుమ్ జిల్లాలోని అస్తి గ్రామానికి చెందిన రామచంద్ర పటార్ ఆరో పెళ్ళి కోసం సిద్దపడ్డాడు. ఇప్పటికే ఆయన ఐదు పెళ్ళిళ్ళను చేసుకొన్నాడు. తాజాగా ఐదో భార్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాని, అయితే ఆమెను పటార్ చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

Man set for sixth wedding held for killing fifth wife

పటార్ తొలుత దశోబాల ను వివాహం చేసుకొన్నాడు.ఆమెతో గొడవలు రావండంతో ఆమెను వదిలివేసి భారతి అనే మహిళను రెండో వివాహం చేసుకొన్నాడు. రెుడో భార్య కూడతో ఆయన ఎక్కువకాలం కాపురం చేయలేదు. వీరిద్దరిని వదిలేశాడు. వీరిద్దరూ పటార్ కు దూరంగా ఉంటున్నారు.

ముగ్గురు భార్యలు అనుమానాస్పద స్థితిలో మరణం

ఇద్దరు భార్యలు విడిపోవడంతో మూడవ భార్యను కూడ ఆయన పెళ్ళిచేసుకొన్నాడు. పుల్మోని అనే మహిళను ఆయన వివాహం చేసకొన్నాడు. ఆమె అనుమానాస్పదస్థితిలో మరణించింది. దీంతో ఆయన ప్రమీల అనే మహిళను నాలుగవ వివాహం చేసుకొన్నాడు. ఆమె కూడ అనుమానాస్పద స్థితిలో మరణించింది.వీరిద్దరూ కూడ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇద్దరు భార్యలు వేరుగా ఉంటున్నారు. ఇద్దరు భార్యలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆయన ఐదవ వివాహం చేసుకొన్నాడు.ఆరు మాసాల క్రితమే ఒడిశాకు చెందిన ఖైరీని ఆయన వివాహం చేసుకొన్నాడు. ఆమె కూడ వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది.

మూడవ, నాలుగవ భార్యలు అనుమానాస్పదస్థితిలో మరణించడంతో వారి కుటుంబసభ్యులు ఎవరూ కూడ ఫిర్యాదు చేయలేదు. అయితే ఐదవ భార్య ఖైరీ మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు పటార్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఖైరీ మృతదేహన్ని పరిశీలిస్తే ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనతో పోలీసులు పటార్ ను ప్రశ్నిస్తున్నారు. ఆరో పెళ్ళి కోసమే ఖైరీని పటార్ హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+