వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దారుణం: సిగరెట్ తాగాడని కత్తితో పొడిచి హత్య చేశాడు

వివరాల్లోకి వెళితే.. బాధితుడు మెట్రో స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఓ షాపు వద్ద సిగరేట్ వెలిగించాడు. ఆ తర్వాత అతడు సిగరెట్ పొగను తన వైపు వదిలాడని నిందితుడు జాహీద్(26) పోలీసులకు చెప్పాడు.
తనకు సిగరెట్ పొగ పడదని చెప్పిన జాహిద్.. అతడితో గొడవకు దిగాడు. గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన జాహీద్ తన వద్ద ఉన్న కత్తితో విచక్షణా రహితంగా అతడ్ని పొడిచాడు. కాగా, అటువైపు వస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంబడించిన పోలీసులు జాహీద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధిత వ్యక్తిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. దీంతో హత్యా నేరం కింద జాహీద్‌పై కేసు నమోదు చేశారు.