Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Neighbour: నా భార్యకు నీ సపోర్టు ఏందిరా ?, బెడ్ రూమ్ లోకి వస్తావా, కరోనా ఎఫెక్ట్ తో, పక్కింటోడు ?

బరేలి/ లక్నో/ చెన్నై: కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో ఇంట్లో ఉంటున్న భర్తకు ఓ రకమైన పిచ్చిపట్టింది. ఓ విషయంలో భర్త భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు. గొడవ పెద్దది కావడంతో ఇంట్లో ఢిష్యూం ఢిష్యూం మొదలైయ్యింది. భార్య అరుపులు కేకలతో ఆ ప్రాంతం అదిరిపోయింది. పక్కింట్లో నివాసం ఉంటున్న వ్యక్తి దంపతుల ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు రెచ్చిపోతున్న భర్త ఒక్కసారిగా అతని భార్యను వదిలేసి పక్కింటి వ్యక్తిని టార్గెట్ చేసుకున్నాడు. నా పెళ్లాం నాకే సపోర్ట్ చెయ్యడం లేదు, నువ్వు ఏందిరా నా పెళ్లానికి సపోర్టు చేస్తున్నావ్, నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చేశావు అంటూ రెచ్చిపోయాడు. భర్తను కొట్టడానికి ఉపయోగించే కర్ర తీసుకుని పక్కింటోడి మీద దాడి చేశాడు. నా ఇంట్లోకి వస్తావా ?, నా పెళ్లాంకు సపోర్టు చేస్తావా ? అంటూ చితకబాదేశాడు. ఈ గొడవలో పక్కింటోడి ప్రాణాలు పోవడంతో ఆ కాలనీలో కలకలం రేపింది.

కరోనా దెబ్బతో భర్తకు ఉద్యోగం పోయింది

కరోనా దెబ్బతో భర్తకు ఉద్యోగం పోయింది

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని ప్రేమ్ నగర్ లో ప్రాంతంలో నవీన్ కుమార్, దీపామాల దంపతులు నివాసం ఉంటున్నారు. గత ఏడాది వరకు దంపతులు చక్కగానే కాపురం చేసుకుంటున్నారు. గత ఏడాది నుంచి దంపతుల మద్య గొడవలు మొదలైనాయని సమాచారం. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో గత నెలలో నవీన్ కుమార్ ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి నవీన్ కుమార్ ఇంట్లోనే ఉంటున్నాడు.

అన్నీ అనుమానాలే

అన్నీ అనుమానాలే

24 గంటలు ఇంట్లోనే ఉంటున్న భర్త నవీన్ కుమార్ ఏదో ఒకరకంగా భార్య దీపామాలాతో గొడవ పడటం మొదలుపెట్టాడు. భార్య దీపా ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడినా, మొబైల్ లో మెసేజ్ లు చూసినా భర్త నవీన్ కుమార్ కు నచ్చడంలేదు. ఏదో ఒకరకంగా భార్య దీపాతో గొడవపడుతున్న నవీన్ కుమార్ ఇంట్లో రచ్చరచ్చ చెయ్యడం మొదలుపెట్టాడు.

భార్య అరుపులు, కేకలతో హడల్

భార్య అరుపులు, కేకలతో హడల్

ఒక్క విషయంలో నవీన్ కుమార్ అతని భర్త భార్య దీపాతో గొడవపడుతూనే ఉన్నాడు. గొడవ పెద్దది కావడంతో ఇంట్లో ఢిష్యూం ఢిష్యూం మొదలైయ్యింది. భార్య దీపా అరుపులు కేకలతో ఆ ప్రాంతం అదిరిపోయింది. ఇదే సమయంలో పెద్ద కర్ర తీసుకున్న నవీన్ కుమార్ అతని భార్య దీపాను పట్టుకుని చితకబాదేశాడు. దెబ్బలు తట్టుకోలేక దీపా ఇంకా గట్టిగా కేకలు వేసింది.

టార్గెట్ మార్చిన భర్త

టార్గెట్ మార్చిన భర్త

దీపా కేకలు ఎక్కువ వెయ్యడంతో వారి పక్కింట్లో నివాసం ఉంటున్న అర్జున్ అనే వ్యక్తి దంపతుల ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు రెచ్చిపోతున్న భర్త నవీన్ కుమార్ ఒక్కసారిగా అతని భార్య దీపాను వదిలేసి పక్కింటి వ్యక్తి అర్జున్ ను టార్గెట్ చేసుకున్నాడు. రేయ్ బాడ్కౌవ్ నా భార్య నన్ను సపోర్టు చెయ్యడం లేదు, నువ్వు ఏందిరా మా ఇంట్లోకి వచ్చావు, నా బెడ్ రూమ్ లోకి వచ్చి నా భార్యకు సపోర్టుగా మాట్లాడుతున్నావ్ అంటూ అర్జున్ ను పట్టుకుని కర్రతో దాడి చెయ్యడం మొదలుపెట్టాడు.

కాలనీ మొత్తం వచ్చేసింది

కాలనీ మొత్తం వచ్చేసింది

దీపాను వదిలేసిన అతని భర్త నవీన్ కుమార్ అదే కర్ర తీసుకుని అర్జున్ ను చితకబాదేశాడు. నీకు నా భార్యకు ఏమిటి సంబంధం, నువ్వు ఎందుకు వచ్చావ్, ఎంతకాలం నుంచి మీరు ఒక్కటి అయ్యారు అంటూ ఏదేదో మాట్లాడిన నవీన్ కుమార్ రెచ్చిపోయాడు. నవీన్ కుమార్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక అర్జున్ గట్టిగా కేకలు వెయ్యడంతో ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్న స్థానికులు అందరూ నవీన్ కుమార్ ఇంటికి చేరుకున్నారు.

ఆసుపత్రికి కాకుండా పోలీస్ స్టేషన్ కు

ఆసుపత్రికి కాకుండా పోలీస్ స్టేషన్ కు


అప్పటికే అర్జున్ తల పగిలిపోయి రక్త కారుతోంది. వెంటనే తీవ్రగాయాలైన అర్జున్ ను ఆసుపత్రికి కాకుండా పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి అక్కడ నవీన్ కుమార్ మీద కేసుపెట్టారు. తరువాత అర్జున్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో అర్జున్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

భర్త దెబ్బకు పక్కింటోడి ప్రాణం పోయింది

భర్త దెబ్బకు పక్కింటోడి ప్రాణం పోయింది

నవీన్ కుమార్, దీపా దంపతుల గొడవలో జోక్యం చేసుకున్న అర్జున్ ప్రాణం పోవడం ప్రేమ్ నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. నవీన్ కుమార్ మీద హత్య కేసు నమోదు చేశామని, అతను పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని బరేలి పోలీసు అధికారి రోహిత్ సింగ్ సజ్వాన్ అన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+