‘‘కేసు వెనక్కి తీసుకుంటావా.. నీ నగ్నచిత్రాలు ఆన్‌లైన్‌లో పెట్టమంటావా?’’

తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోకుంటే నీ నగ్నచిత్రాలు, వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ భార్యను బెదిరించిన భర్త బాగోతమిది. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వెలుగుచూసింది.

న్యూఢిల్లీ : తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోకుంటే నీ నగ్నచిత్రాలు, వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ భార్యను బెదిరించిన భర్త బాగోతమిది. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వెలుగుచూసింది.

న్యూఢిల్లీలోని మంగోల్ పురి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై చాందినీమహల్ లో గత ఏడాది అత్యాచారం చేశాడు. యువతి అత్యాచారం కేసు పెట్టడంతో భయపడిన ఆ యువకుడు బాధిత యువతిని పెళ్లి చేసుకున్నాడు.

Man threatens wife, says he will post her 'obscene' pictures online

వారి పెళ్లితో అతడిపై ఉన్న అత్యాచారం కేసును కోర్టు కొట్టేసింది. తనపై ఉన్న కేసు కొట్టివేయడంతో అతడిలో రాక్షసుడు మళ్లీ జూలు విదిల్చాడు. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని చిత్రహింసలు పెట్టాడు.

దీంతో అతడి భార్య మళ్లీ అతడిపై కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో భార్య పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని.. లేదంటే ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ భర్త బెదిరించాడు. ఈ మేరకు మళ్లీ అతడి భార్య ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు అతడిపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+