ఇద్దరు కూతుళ్లపై రేప్: తండ్రిని రెండుసార్లు ఉరి తీయాలని కోర్టు

కోయంబత్తూరు: కుమార్తెలపై అత్యాచారం చేసిన కామాంధుడిని రెండు సార్లు ఉరి తియ్యాలని తమిళనాడులోని కోయంబత్తూరు కోర్టు సంచలనమైన తీర్పు వెల్లడించింది. కోయంబత్తూరుకు చెందిన గోవిందరాజ్ (36) అనే కామాంధుడికి కోర్టు శిక్ష విదించింది

నిందితుడిని రెండు సార్లు ఉరి తియ్యాలని కోయంబత్తూరు జిల్లా మహిళ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణియన్ శుక్రవారం తీర్పు చెప్పారు. గోవిందరాజు కుమార్తె (12) పేరు మీద రూ. ఒక లక్ష డిపాజిట్ చేసి బాలికను ఆదుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు.

తీర్పు వెలువడిని మూడు నెలలలోపు నగదు డిపాజిట్ చెయ్యాలని సూచించారు. అవసరం అయితే నిందితుడి ఆస్తిని విక్రయించి నగదు డిపాజిట్ చెయ్యాలని న్యాయమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. గోవిందరాజ్ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి 17, 12 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు కుమార్తెలు (ఒకరు భార్య మొదటి భర్త కుమార్తె )లు ఉన్నారు.

గోవిందరాజ్ భార్య మొదటి కుమార్తె (17) మీద కన్ను పడింది. ఆమె కోయంబత్తూరులోని ఎయిడెడ్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నది. గత 5 సంవత్సరాల పాటు కుమార్తె మీద అత్యాచారం చేస్తూ వచ్చాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.

man was sentenced to double life term

బాలిక బయపడి విషయం బయటకు చెప్పలేదు. నిరుడు తండ్రి వేదింపులు తట్టుకొలేక కాలేజ్ హాస్టల్ లో తలదాచుకుంది. అక్కడికి వెళ్లి గొడవ చేసిన గోవిందరాజ్ కుమార్తెను ఇంటికి తీసుకు వెళ్లి రేప్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఇంటిలో ఉన్న సొంత కుమార్తె (12)పై కూడా ఏడాది పాటు రేప్ చేస్తూ వచ్చాడు.

చివరికి బాలిక తన స్నేహితుడు శరవణన్ కు విషయం చెప్పింది. షర్మిల అనే మహిళ సహాయంతో శరవణన్ బాలికను వివాహం చేసుకున్నాడు. పెద్ద కుమార్తె వెళ్లి పోయిన తరువాత గత మూడు నెలల నుండి ఇంటిలో ఉన్న 12 సంవత్సరాల కుమార్తె మీద విచ్చలవిడిగా లైంగికదాడి చేశాడు.

తనకుమార్తె కనపడటం లేదని గోవిందరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి బాలికను, శరవణన్ పట్టుకున్నారు. బాలిక తన తండ్రి అరాచాకాల గురించి పోలీసులకు చెప్పింది. 12 సంవత్సరాల బాలిక పోలీసులకు జరిగిన విషయం చెప్పడంతో అతని బండారం బయటపడింది. పోలీసులు గోవిందరాజ్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+