"దావూద్ కారును కాల్చావు, నిన్ను అక్కడే కాల్చేస్తాం"

ఘజియాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అఖిల భారత్ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ ఆరోపించారు.

నిత్యం తనకు గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు ఫోన్ లు, మెసేజ్ లు వస్తున్నాయని స్వామి చక్రపాణి మహరాజ్ తెలిపారు. ఇప్పటి వరకు తనకు చాల బెదిరింపు ఫోన్ లు, మెసేజ్ లు వస్తున్నాయని స్వామి చక్రపాణి మహరాజ్ అన్నారు.

Man who burnt Dawood Ibrahim’s car alleges receiving threat calls

దావూద్ కారును బహిరంగంగా తగలబెట్టిన చోటే నిన్ను తగులబెడతాం జాగ్రత్త అంటూ ఫోన్ లో బెదిరించారని చెప్పారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఉపయోగించిన కారును ముంబైలో డిసెంబర్ 9వ తేదిన వేలం పాటలో రూ. 32 వేలకు స్వామి చక్రపాణి మహరాజ్ దక్కించుకున్నారు.

తరువాత ఆ కారును ముంబై నుంచి ఢిల్లీ నగర శివార్లలోని ఘజియాబాద్ కు తరలించారు. ఇటీవల దావూద్ కారును బహిరంగంగా తలబెట్టారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తాను కలిసి నప్పుడు జెట్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారని, అయితే తాను తిరస్కరించానని స్వామి చక్రపాణి మహరాజ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+