కన్నయ్యని చంపితే...: అతని వద్ద ఉన్నవి రూ.150
ఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి కన్నయ్య కుమార్‌ను చంపితే రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించిన వ్యక్తి బ్యాంకు అకౌంటులో కేవలం రూ.150 మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, అతను ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
కన్నయ్య కుమార్‌ను చంపిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని పూర్వాంచల్ సేన అధ్యక్షులు ఆదర్శ శర్మ ప్రకటించారు. అయితే, ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్నది కేవలం రూ.150 మాత్రమేనట. రోహిణీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన, కనీసం అద్దె చెల్లించేందుకే అష్టకష్టాలు పడుతున్నాడని తెలుస్తోంది.

కన్నయ్యను హత్య చేయాలని కోరుతూ.. వారికి భారీగా నజరానా ఇస్తామని ఆదర్శ్ సంతకంతో కూడిన పోస్టర్లు పుట్టుకు వచ్చాయి. ఈ విషయమై ఆయనపై కేసు నమోదయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆదర్శ శర్మ మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉంది.












Click it and Unblock the Notifications