వివాహిత మహిళతో అక్రమ సంబంధం: రైల్వే ట్రాక్ పై ముక్కలు ముక్కలుగా ! ముట్టుకోం
వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని గొడవలకు కారణం అయ్యారు. చివరికి పెద్దలు తమ అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నారని భయంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగింది.
మైసూరు: వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని గొడవలకు కారణం అయ్యారు. చివరికి పెద్దలు తమ అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నారని భయంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగింది.
మైసూరు జిల్లా టీ. నరసీపురకు చెందిన సునీల్ అలియాస్ సునీల్ కుమార్ (28), మంజుల (25) ఆత్మహత్య చేసుకున్నారని మండ్య జిల్లా రైల్వే పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో చిక్కిన బైక్ నెంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించామని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.

ఆమెకు ముందే పెళ్లి అయ్యింది !
మంజులకు వేరే వ్యక్తితో పెళ్లి అయ్యింది. భర్తతో కలిసి టీ. నరసీపురలో నివాసం ఉంటున్నది. పెళ్లి కాని సునీల్ వివాహిత అయిన మంజుల మీద కన్ను వేశాడు. మంజుల కూడా సునీల్ వలలో పడింది. ఇద్దరూ అక్రమ సంబంధం సాగించారు.

భర్తకు తెలిసింది, వార్నింగ్ ఇస్తే !
మంజుల వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని ఆమె భర్తకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని భార్య మంజులను హెచ్చరించాడు. అయితే భర్త చెప్పిన బుద్దిమాటలు లెక్కచెయ్యని మంజుల సునీల్ పిలిచిన ప్రతి చోటకు వెళ్లింది.

పంచాయితీ పెట్టినా ఫలితం శూన్యం !
మంజుల భర్త పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. మంజుల, సునీల్ ను పంచాయితీకి పిలిచి బుద్ది మాటలు చెప్పారు. మంజులను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఇంత జరిగినా మంజుల, సునీల్ మాత్రం వారి పద్దతి మార్చుకోలేదు.

సునీల్, మంజుల ఇంటి దగ్గర గొడవ !
సునీల్, మంజుల విషయంలో పెద్ద గొడవే జరిగింది. మంజుల కుటుంబ సభ్యులు, ఆమె భర్త కలిసి సునీల్ ఇంటి దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. తరువాత సునీల్ కుటుంబ సభ్యులు మంజుల ఇంటి దగ్గరకు వెళ్లి ఆమెను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

ఆత్మహత్య చేసుకోవాలని !
నిత్యం ఇంటి దగ్గర గొడవలు జరగడంతో మంజుల, సునీల్ జీవితంపై విరక్తి పెంచుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ మైసూరు నుంచి బైక్ లో బయలుదేరి మండ్య జిల్లాలోని మద్దూరు చేరుకున్నారు.

డెత్ నోట్ లో చివరి కోరిక !
మద్దూరు సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర బైక్ పార్క్ చేశారు. తరువాత ఇద్దరూ ఓ డెత్ నోట్ రాసిపెట్టారు. ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని, మా మృతదేహాలకు ఒకే చోట అంత్యక్రియలు చెయ్యాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. తరువాత బెంగళూరు నుంచి మైసూరు వెలుతున్న బసవ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ముక్కలు, ముక్కలు
ఎక్స్ ప్రెస్ రైలు కిందపడటంతో ఇద్దరి శరీరాలు ముక్కలు ముక్కలు అయ్యాయి. బైక్ నెంబర్ ఆధారంగా ఇద్దరి వివరాలు సేకరించిన పోలీసులు మంజుల, సునీల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాలు తీసుకోం !
మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించారు. తరువాత మంజుల, సునీల్ కుటుంబ సభ్యులను పిలిపించిన రైల్వే పోలీసు అధికారులు మృతదేహాలను తీసుకు వెళ్లాలని సూచించారు. అయితే మృతదేహాలు తీసుకోవడానికి మంజుల, సునీల్ కుటుంబ సభ్యులు నిరాకరించారు.

గ్రామస్తులు ఒత్తిడి చెయ్యడంతో
మంజుల, సునీల్ కుటుంబ సభ్యులకు వారి గ్రామస్తులు, పోలీసులు నచ్చచెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందని, మృతదేహాలు తీసుకోవాలని సూచించారు. తరువాత మంజుల, సునీల్ మృతదేహాలను తీసుకున్న కుటుంబ సభ్యులు వారివారి సొంత గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications