మోదీతో సుమలత భేటీ, బీజేపీకి షాక్ ఇచ్చిన తెలుగింటి ఆడపడుచు, ఝలక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ఒకవైపు బీజేపీ, జేడీఎస్ పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి. ఇలంటి సమయంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగాయి.
అయితే అదే సమయంలో మండ్య ఎంపీ సుమలత అంబరీష్ హఠాత్తుగా ప్రధాని నరేంద్ర మోదిని కలిశారు. జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు విషయంలో చర్చలు విజయవంతం అయితే బీజేపీ కొన్ని సీట్లు వదులుకుని జేడీఎస్ కు ఇవ్వాల్సి ఉంటుంది. చర్చలు సెటిల్ మెంట్ అయితే పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం చర్చల ప్రకారం దాదాపు నాలుగు లోక్‌సభ స్థానాలు జేడీఎస్ అభ్యర్థులకు ఇచ్చి మిగిలిన 24 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టవచ్చు. అని అని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు. ఇదే పరిస్థితి ఎదురైతే ఇప్పటి వరకు ఎంపీ పదవుల కోసం ఆశలు పెట్టుకున్న నాయకుల తలరాతలు తల్లకిందులు అయ్యే అవకాశం ఉంది.
మండ్య లోక్‌సభ నియోజకవర్గం, మైసూరు లోక్‌సభ నియోజకవర్గాలు జేడీఎస్ చేతికి వెళ్లిపోతాయని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారని ఇప్పటికే ప్రచారం మొదలయ్యింది. అదే సమయంలో మండ్య ఎంపీ సుమలత అంబరీష్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదిని కలవడం ఆసక్తిని రేకెత్తించింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్- కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాయి. 2019లో మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇలాంటి చాన్స్ కోసం ఎదురు చూసిన బీజేపీ చివరి వరకు బీజేపీ అభ్యర్థిని మండ్యలో నిలబెడుతామని చెబుతూ వచ్చింది.

అయితే బీజేపీకి ఇదే పెద్ద టాస్క్ అయిన తరుణంలో అభ్యర్థిని నిలబెట్టకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలత అంబరీష్ కు బీజేపీ మద్దతు పలికింది. తరువాత నిఖిల్ కుమారస్వామిని చిత్తుగా ఓడించిన సుమలత ఎంపీ అయ్యారు. సుమలతకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు లభించిందని అందరూ అంటున్నారు.
కానీ ఇప్పుడు బీజేపీ-జేడీఎస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ఖాయమైతే మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో పరిస్థితి తారుమారు అవుతుంది. ప్రధాని మోదీతో తన భేటీ గురించి ట్విట్టర్ (X)లో పోస్టు చేసిన ఎంపీ సుమలత మనం గర్వించదగ్గ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆయన 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను అని వివరించారు.
ఇటీవల జరిగిన G20 సమ్మిట్ విజయవంతం అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీని తాను అభినందించాను, ఇదే సందర్భంలో నా మండ్య లోక్ సభ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించానని, దీనికి సంబంధించి గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోదీ తనకు అనేక సూచనలు, సహకారాలు అందించారని సుమలత ట్విట్టర్ లో వివరించారు.
చాలా ఒత్తిడి, పనిలో బిజీగా ఉన్నప్పటికీ ఇంత తక్కువ సమయంలో నన్ను సందర్శించడానికి అనుమతించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు, దేశం కోసం మీ కృషి మరియు దృక్పథం ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా ఉండాలని, మీరే మాకు రోల్ మోడల్ అంటూ మండ్య ఎంపీ సుమలత అంబరీష్ థ్యాంక్యూ సార్ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ನಮ್ಮೆಲ್ಲರ ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗಳಾದ ಮಾನ್ಯ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು ಭೇಟಿ ಮಾಡಿ 73ನೇ ಜನ್ಮ ದಿನದ ಶುಭಾಶಯಗಳನ್ನು ಹೇಳಿದೆ. ಮತ್ತು ಇತ್ತೀಚೆಗಷ್ಟೇ ನಡೆದ G20 ಶೃಂಗಸಭೆಯ ಯಶಸ್ಸಿಗೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸಿದೆ.
— Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) September 19, 2023
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನ್ನ ಕ್ಷೇತ್ರ ಮಂಡ್ಯ ಮತ್ತು ಕರ್ನಾಟಕದ ಹಲವಾರು ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ನಡೆಸಲಾಯಿತು. ಅದಕ್ಕೆ… pic.twitter.com/GFDsjZy0ZP
సుమలత అంబరీష్ ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ముఖ్యంగా జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే ఎంపీ సుమలతకు బీజేపీ మద్దతు లేదా మండ్యలో బీజేపీ టికెట్ దక్కడం అనుమానమే. ఇక జేడీఎస్ మండ్య నియోజకవర్గాన్ని తమ అభ్యర్థి కోసం కోరుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎంపీ సుమలత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications