Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీ సీట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ లీడర్స్, మోదీతో మీకుపోటీనా ?, ఎంపీ సుమలత సంచలనం !

ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పిస్తామంటూ కాంగ్రెస్‌లో డబ్బులు తీసుకునే సంస్కృతి ఉందని మండ్య ఎంపీ సుమలత అంబరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరని వారిని మండ్యలో అభ్యర్థులను చేశారని సుమలత ఆరోపించారు. మండ్యలో విలేకరులతో మాట్లాడినిన సుమలత కర్ణాటక ప్రభుత్వ నిధులతో బూదనూరు ఉత్సవాలు నిర్వహించామన్నారని చెప్పారు.

ప్రభుత్వ కార్యక్రమంలో మండ్య లోక్‌సభ అభ్యర్థిగా ఓ వ్యక్తిని పరిచయం చేసుకుంటున్నారని, ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి లోక్ సభ ఎన్నికల ప్రాచారం చేసుకుంటారా ?, ఈయన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి అని పరిచయం చేస్తున్నారా ?, అలాంటప్పుడు మీరు ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని సుమలత అంబరీష్ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో మూర్ఖులు నామినేషన్ వేస్తారని, మండ్య ప్రజలు మూర్ఖులు కాదని, లోక్ సభ అభ్యర్థుల్లో ఎవరికి పట్టంకట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని, మండ్య ప్రజలను డబ్బుతో కొనలేమని సుమలత అన్నారు.

Mandya MP Sumalatha made sensational comments that Congress party is selling Lok Sabha MP seats

ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఉండటం దేశం అదృష్టమని, నేను బీజేపీ పార్టీ నుంచి ఎంపీని కావాలని అనుకుంటున్నానని, తనకు టిక్కెట్టు వస్తుందన్న నమ్మకం ఉందని సుమలత అన్నారు. అవసరమైనప్పుడల్లా మండ్యకు వచ్చానన్నది నిజం, పార్లమెంట్ లో సమవేశాలు ఉన్నప్పుడు మండ్యకు రాలేదని, లోక్‌సభ గడువు ముగియనుందని, ఇప్పుడు ఎంపీ నిధులతో పనులు ప్రారంభించకుంటే ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని సుమలత అన్నారు.

అందుకే ఎక్కువగా మండ్యలో పర్యటించి పనిచేస్తున్నట్లు సుమలత తెలిపారు. బీజేపీ-జేడీఎస్ కూటమి టిక్కెట్‌పై బీజేపీ పార్టీ ప్రకటన చేసే వరకు ఏదీ ఫైనల్ కాదని, నాకు టికెట్ వస్తుందన్న నమ్మకం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని. అయితే పార్టీ నుంచి అధికారిక ప్రకటన రానుందని, సుమలత పనితీరును చూసి బీజేపీ తనకు టికెట్ ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని సుమలత అంబరీష్ అన్నారు.

గత ఎంపీలకు, నా పనికి తేడా ఉందని, నరేంద్ర మోదీ విజన్, ఆయన పని తీరు, అభివృద్ధి మంత్రం తనకు బీజేపీ టిక్కెట్ వస్తుందని నమ్మకం తనకు చాలా ఎక్కువగా ఉందని సుమలత అంబరీష్ అన్నారు., తాను ప్రధాన్ సేవక్ అని సుమలత చెప్పుకుంటున్నారు బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ అయితే మోదీ హస్తం బలపడుతుందని సుమలత అన్నారు. అయితే మండ్య ఎంపీ సీటు తమకే కావాలని జేడీఎస్ మొదటి నుంచి బలంగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మొత్తం మీద మండ్య లోక్ సభ సీటు ఎవరికి ? అనే టెన్షన్ కు త్వరలో తెరపడుతుందని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+