గాడిద పాల సబ్బుతో స్నానం చేస్తే ఆడవారి శరీరం.. మేనకాగాంధీ సంచలన వ్యాఖ్యలు...
ఎప్పుడూ తమ సంచలన వ్యాఖ్యలతో ఉండే బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఇవాళ మరో సంచలన కామెంట్ చేశారు. గాడిద పాలతో తయారైన సబ్బుతో ఒళ్లు రుద్దుకుంటే మహిళలు అందంగా మారతారని మేనక వ్యాఖ్యానించారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలతో తయారైన సబ్బునే వాడేవారని వెల్లడించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లోని చౌపాల్ లో ప్రసంగించిన మేనకాగాంధీ.. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర గాడిద పాలతో తయారైన సబ్బుల్నే వాడేవారన్నారు. ఢిల్లీలో గాడిద పాలతో తయారైన సబ్బు రూ.500 ధర పలుకుతుందన్నారు. మనం ఎందుకు గాడిద, మేక పాలతో సబ్బులు తయారు చేయకూడదని మేనక ప్రశ్నించారు. లడఖ్‌లో స్ధానికంగా ఓ సంఘం గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తోందని కూడా పేర్కొన్నారు.

మీరు చివరిసారిగా గాడిదను ఎప్పుడు చూశారు? వాటి సంఖ్య పడిపోతోంది, చాకలి వారు గాడిదలను ఉపయోగించడం మానేశారని మేనకాగాంధీ స్ధానికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లడఖ్‌లో గాడిద పాలతో సబ్బులు తయారు చేసే సంఘం ఒకటుంది. వారు సబ్బులను తయారు చేయడానికి గాడిద పాలను ఉపయోగించడం ప్రారంభించారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు స్త్రీ శరీరాన్ని ఎప్పటికీ అందంగా ఉంచుతాయని మేనకాగాంధీ తెలిపారు.

అడవుల గురించి కూడా మేనకాగాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చెక్క చాలా ఖరీదైనదిగా మారింది. మరణంలో కూడా కుటుంబాలు పేదలుగా మిగిలిపోతాయి. కలప ధర సుమారు రూ.15,000-20,000 పలుకుతోంది. బదులుగా మనం ఆవు పేడ దుంగలకు సువాసన పదార్థాలను జోడించి, చనిపోయినవారిని దహనం చేయడానికి ఉపయోగించాలన్నారు. ఇది కర్మల ఖర్చును కేవలం రూ. 1,500-2,000కి తగ్గిస్తుందన్నారు. మీరు ఆ దుంగలను అమ్మడం ద్వారా లక్షలు సంపాదించవచ్చని స్ధానికులకు సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications