Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్

ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏదీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీదా దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వంట వండటానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఎల్పీజీ వంటగ్యాస్ తో కూడిన భారీ కార్గో షిప్ కర్ణాటకలోని మంగళూరుకు చేరింది. కొద్దిసేపటి కిందటే మంగళూరు న్యూ పోర్ట్ లో లంగర్ వేసింది. అమెరికాలోని టెక్సాస్ నుండి ఎల్‌పీజీని మోసుకొచ్చిన పైక్సిస్ పయనీర్ అనే భారీ కార్గో షిప్ ఇది. మొత్తం 72,700 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)ను తీసుకొచ్చింది. 13వ బెర్త్‌లో లంగర్ వేసినట్లు న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ డైలీ వెస్సెల్ పొజిషన్ తెలిపింది.

Mangalore Port Welcomes Pyxis Pioneer Carrying LPG Government Expands Allocation Amid Shortage

సింగపూర్ జెండా ఈ ట్యాంకర్ ఇక్కడికి చేరుకుంది. బయలుదేరే ముందు 72,700 టన్నుల ఎల్పీజీని ఇందులో లోడ్ చేశారు. దీన్ని ప్రాధాన్యతారంగాలుగా విభజించారు. ఏజిస్ లాజిస్టిక్ లిమిటెడ్ కోసం 16,714 టన్నుల ఎల్పీజీని అన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు మార్చి 18న సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో కూడిన జాగ్‌ లాడ్కీ అనే ట్యాంకర్ ముంద్రా పోర్ట్‌కు చేరుకుంది.

దీంతో పాటు సుమారు 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చిన నందాదేవి కార్గో షిప్.. వడినార్‌ పోర్ట్‌కు చేరింది. అలాగే శివాలిక్ కార్గో వెసెల్ కూడా ముంద్రాలో లంగర్ వేసింది. వీటి ద్వారా దాదాపుగా లక్ష మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్ కుఅందింది. దీనికి అదనంగా ఇప్పుడు తాజాగా పైక్సిస్ పయనీర్ మంగళూరుకు రావడంతో మరో 72,700 టన్నుల ఎల్పీజీ అందినట్టయింది.

పోర్ట్ అథారిటీ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఈ నెల 29న అమెరికా నుండి 30,000 టన్నుల ఎల్పీజీతో కూడిన మరో ట్యాంకర్ ఇక్కడికి రావాల్సి ఉంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం ఈ ఎల్పీజీని వినియోగిస్తారు. మంగళూరులోని హెచ్పీసీఎల్ లో ఈ ఎల్పీజీ అన్ లోడ్ అవుతుంది. అనంతరం దీన్ని స్థానిక బాట్లింగ్ ప్లాంట్‌లకు సరఫరా చేస్తారు. మంగళూరు-బెంగళూరు ఎల్పీజీ పైప్‌లైన్ ద్వారా బెంగళూరు, ఇతర ప్రాంతాలకు ఇది పంపిణీ అవుతుంది. ప్రాధాన్యత రంగాల ఆధారంగా దీన్ని కేటాయిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+