vastu tips: వంటపొయ్యిని కొంచెం మార్పు చేస్తే లక్ష్మీదేవి నడిచొస్తుంది!
ఈ రోజుల్లో ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే, మన ఇంట్లో ఉండే కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలే దీనికి కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటింట్లోని స్టవ్ నుంచి మనం పడుకునే బెడ్‌రూమ్ వరకు కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటే, ఇంట్లో ధన ప్రవాహం పెరిగి, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆ అద్భుతమైన వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వంటింట్లో స్టవ్ ఇలా ఉండాలి
మన ఇంట్లో వంటగది ప్రగతికి సూచిక. ముఖ్యంగా మీరు వాడే గ్యాస్ స్టవ్ ఎప్పుడూ శుభ్రంగా, మెరుస్తూ ఉండాలి. మురికిగా ఉండే స్టవ్ ఆర్థిక ఎదుగుదలను నొక్కిపెట్టేస్తుంది. స్టవ్‌కు ఉండే అన్ని బర్నర్లను సమానంగా వాడాలి. ఇది ధన ప్రవాహాన్ని యాక్టివేట్ చేస్తుంది. వీలైతే అప్పుడప్పుడు పసుపు రంగులో ఉండే వంటకాలు వండి ప్రసాదంగా పెట్టడం వల్ల ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి.

మీ వాలెట్ (పర్సు) చిరిగిందా?
డబ్బులు దాచుకునే పర్సు ఎప్పుడూ నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. చిరిగిన పర్సులు వాడితే ఆర్థిక పరిస్థితి కూడా అలాగే చిరిగిపోతుందని వాస్తు చెబుతోంది.ఎరుపు, ఆకుపచ్చ లేదా నలుపు రంగు వాలెట్లు సంపదను ఆకర్షించడానికి బెస్ట్. మీ పర్సులో ఎప్పుడూ ఒక బియ్యం గింజ లేదా ఒక చిన్న వెండి నాణెం ఉంచుకోండి. ఇది లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది.
ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే పారేయండి
ఇంట్లో గందరగోళం, చెత్తాచెదారం ఉంటే నెగిటివ్ ఎనర్జీ అయస్కాంతంలా ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా విరిగిపోయిన వస్తువులు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ సామాన్లు ఇంట్లో ఉంచకూడదు. ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ ఖాళీగా, ప్రశాంతంగా ఉంచాలి. అక్కడ బరువైన వస్తువులు లేదా పనికిరాని సామాన్లు పెడితే అప్పుల పాలు కాక తప్పదు.
ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీకి చెక్
వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ప్రతికూల శక్తులను పీల్చుకునే అద్భుత శక్తి ఉంది. ఒక చిన్న గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు (కల్లుప్పు) వేసి ఇంట్లోని మూలల్లో ఉంచండి.వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ పెరిగి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
కుబేర స్థానాన్ని యాక్టివేట్ చేయండి
ఇంటి ఉత్తర దిక్కుకు అధిపతి సంపదలకు దేవుడైన కుబేరుడు. ఈ దిక్కును ఎప్పుడూ క్లీన్‌గా, ఓపెన్‌గా ఉంచాలి. ఒక అందమైన గిన్నెలో నీరు పోసి, అందులో కొన్ని తాజా పూల రెక్కలను వేసి ఉత్తర దిశలో పెట్టండి. ఇది కుబేర స్వామిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది.
పడుకునే పొజిషన్ మార్చండి
మీ బెడ్‌రూమ్ వాస్తు కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని శాసిస్తుంది. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పుడూ దక్షిణం లేదా తూర్పు వైపు తల పెట్టి మాత్రమే పడుకోవాలి. అలాగే, ఇంటి యజమాని బెడ్‌రూమ్ ఎప్పుడూ ఇంటి నైరుతి మూలలో ఉండటం వల్ల సంపాదన నిలకడగా ఉంటుంది.
















Click it and Unblock the Notifications