ఆ బంగారు భూమిపై అందరి కళ్ళు!

వరంగల్ జిల్లాలో ఒక సాధారణ వ్యవసాయ భూమి ఇప్పుడు బంగారు భూమి అన్న చర్చకు కారణమైంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఆరు ఎకరాల పొలంలో పురాతన బంగారు ఆభరణాలు లభించడంతో స్థానికుల మధ్య తీవ్రమైన కౌలు పోటీ మొదలైంది. ఈ భూమిని ఎలాగైనా తమ చేతికి తెచ్చుకోవాలని రైతులు భూస్వామి చుట్టూ గుంపులుగా తిరుగుతున్నారు.

పొలంలో బంగారం

జూన్ 24న వర్షాల తర్వాత పత్తి చేనులో కలుపు తీస్తున్న మహిళా కూలీలకు మట్టిలో నుంచి పాత బంగారు ఆభరణాలు దొరికాయి. అయితే ఈ బంగారం తనకు చెందుతుందని కౌలు రైతు తీసుకున్నాడు. దీంతో కూలీల ద్వారా ఈ విషయం గ్రామంలో అందరి చెవినా పడింది. గతంలో ఈ భూమి యజమాని ఆ బంగారం తనకు రావాలని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gold in farmland gold Ornaments Discovered in Warangal Farmland Police Complaint Filed Over Gold

కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలు .. అక్కడ గుప్తనిధులు

అయితే ఈ భూమిలో బంగారం దొరకటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ పొలంలో బంగారు నాణేలు, దేవతా విగ్రహాలు లభించినట్లు స్థానికులు చెబుతున్నారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలు ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ గుప్త నిధులు దొరికే అవకాశం ఉందనే నమ్మకం స్థానికుల్లో బలంగా ఉంది. పదేళ్ల క్రితం ఈ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ప్రస్తుతం ఒక రైతుకు కౌలుకు ఇచ్చి పత్తి సాగు చేయిస్తున్నాడు.

కౌలు కోసం పోటీ పడుతున్న రైతులు

ఇక అతనికి భూమి అమ్మిన పాత యజమాని కూడా అందులో తన వాటా తేల్చాలని రంగంలోకి దిగాడు. దీంతో బంగారం దొరికిన వార్త వెలుగులోకి వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది రైతులు కౌలు కోసం పోటీపడుతున్నారు. రాత్రి సమయాల్లో కూడా టార్చ్ లైట్లు, గునపాలతో పొలంలో నిధుల కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధుల విడుదల నేడే!
రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధుల విడుదల నేడే!

బంగారం ఎవరికి చెందుతుందంటే

భూమి యజమాని ఎవరికి కౌలు ఇవ్వాలనే నిర్ణయం చేయడంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.ఈ ఘటన రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఒకవేళ మరిన్ని నిధులు దొరికితే రాత్రికి రాత్రే ఆర్థిక స్థితి మారిపోయే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. అయితే, అసలు ఈ బంగారం ఎవరికి చెందుతుంది.. పురాతన కాలం నాటిది కాబట్టి ఇది ఆర్కియాలజీకి చెందుతుంది. ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది అన్నది కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+