నాని 'ప్యారడైజ్' మరోసారి వాయిదా..? రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా..?
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత జూన్ లో రిలీజ్ అన్నారు. అయితే అప్పటికి కూడా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21 కు వాయిదా వేశారు. అయితే ఈ తేదీ కూడా కరెక్ట్ కాదని ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు వైరల్ గా మారాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గట్టిగానే ఖండించింది. కానీ చివరకు ఇదే నిజం అయినట్లు సమాచారం.
'ప్యారడైజ్' మూవీ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అటు నాని ఫ్యాన్స్, శ్రీకాంత్ ఓదెల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చెయ్యాలా..? లేక డిసెంబర్ నెలలో రిలీజ్ చెయ్యాలా..? అనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటిస్తే మళ్లీ వాయిదా పడేందుకు ఆస్కారం లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే చర్చించి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

ఇక మరోవైపు నేచురల్ స్టార్ నాని సుజీత్ దర్శకత్వంలో ది బ్లడీ రోమియో సినిమా చేయాల్సి ఉంది. ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఆ చిత్రాన్ని నాని హోల్డ్ లో పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే సెకండాఫ్ స్క్రిప్ట్ బౌండెడ్ గా లేకపోవడం, తీసిన సీన్లనే మళ్లీ మళ్లీ తీయడం కూడా ప్యారడైజ్ మూవీ వాయిదాకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ లో కయాదు లోహర్ నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications