విలన్‌తో ప్రేమలో పడ్డ నిహారిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ !!
ఇన్ స్టాగ్రామ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫ్లుయెన్సర్ "నిహారిక NM" గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ క్రియేటర్ గా ఆమె వీడియోస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గానే వైభవ్ హీరోగా నటించిన " పెరుసు "చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటించింది. అలానే తెలుగులో మిత్రమండలి చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోయింది. కానీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ గా.. నాని ది ప్యారడైజ్ మూవీ విలన్ తో ప్రేమలో పడినట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా ఈ పోస్టును నిహారికతో పాటు సదరు వ్యక్తి కూడా షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రేమలో పడ్డ నిహారిక..
యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రాఘవ్ జుయల్.. కిల్ చిత్రంతో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ రొమాంటిక్ గా దిగిన ఫోటోలను ఇటు నిహారిక అటు రాఘవ్ తమ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. రెడ్ హార్ట్ ఎమోజీని పంచుకున్నారు. అలానే ఈవిల్ ఐ, స్టార్ ఎమోజీలను క్యాప్షన్ గా పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని జోరుగా చర్చ నడుస్తోంది.

అయితే వీరిద్దరూ నిజంగా ప్రేమలో పడ్డారు అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని.. ఇది కేవలం ప్రమోషన్స్ మాత్రమే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం లండన్ నేపథ్యంలో వివేక్ బి అగర్వాల్ దర్శకత్వంలో రూపొందుతున్న "భాయ్ తేరా స్టార్ హై" అనే చిత్రంలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే వీరిద్దరూ తమ సినిమాపై హైప్ పెంచడం కోసం ఇలా పోస్ట్ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఇది ప్రమోషన్స్ కోసమా లేక నిజంగానే ఈ జంట ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ క్రేజీ జోడి షేర్ చేసిన ఈ రొమాంటిక్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్నాయి. అటు అభిమానులు, నెటిజన్లు వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందని మెచ్చుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.












Click it and Unblock the Notifications