30 ఏళ్ల మిస్టరీ.. మంచు కొండల్లో 'బంగారు నిధి'

అగ్నిపర్వతం అంటే మనకు మొదట గుర్తొచ్చేది మండే లావా, ఎగిసిపడే నిప్పుకణాలు, దట్టమైన పొగ. కానీ ఈ భూమ్మీద ఒక విచిత్రమైన అగ్నిపర్వతం ఉంది. అది నిప్పులు కాదు.. ఏకంగా స్వచ్ఛమైన బంగారాన్ని గాల్లోకి విరజిమ్ముతోంది! వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. మైనస్ డిగ్రీల చలితో గడ్డకట్టుకుపోయే అంటార్కిటికా ఖండం లోతుల్లో ఉన్న 'మౌంట్ ఎరెబస్' (Mount Erebus) అనే అగ్నిపర్వతం ఏటా ఏకంగా రూ. 18.9 కోట్ల ($2 మిలియన్లు) విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని గాల్లోకి పంపిస్తూ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

రోజుకు 5.6 లక్షల విలువైన బంగారం!

ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన ఉన్న ఏకైక యాక్టివ్ (జీవంతో ఉన్న) అగ్నిపర్వతం ఈ మౌంట్ ఎరెబస్. రోస్ ఐలాండ్‌లో ఉండే ఈ అగ్నిపర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో నిరంతరం రగల్చుకుంటూ ఉండే ఒక శాశ్వత లావా సరస్సు (Lava Lake) ఉంటుంది. 'జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం.. ఈ అగ్నిపర్వతం ప్రతిరోజూ సుమారు 80 గ్రాముల మైక్రోస్కోపిక్ (కంటికి కనిపించనంత చిన్నవి) బంగారు స్ఫటికాలను (Crystals) వాతావరణంలోకి విడుదల చేస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే దీని విలువ రోజుకు సుమారు రూ. 5,66,000 ($6,000) పైనే ఉంటుంది.

Mount Erebus Volcano Antarctica Volcano Blasts Over Eighteen Crore Rupees Worth of Gold Daily Into Air

1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే పసిడి రేణువులు!

ఈ అగ్నిపర్వతం నుంచి నిరంతరం వెలువడే వాయువులు ఈ మైక్రోస్కోపిక్ బంగారు కణాలను తమతో పాటు పైకి మోసుకెళ్తాయి. ఇవి ఎంత తేలికగా ఉంటాయంటే, అక్కడి బలమైన గాలుల వల్ల ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరం వరకు గాల్లో ప్రయాణించి, చివరకు అంటార్కిటికా మంచు కొండలపై పేరుకుపోతాయి. శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లను ఉపయోగించి ఈ మంచును పరిశీలించినప్పుడు.. అది సాధారణ బంగారు ధూళి కాదని, దాదాపు 60 మైక్రోమీటర్ల పరిమాణంలో పక్కా ఆకృతిని కలిగి ఉన్న స్వచ్ఛమైన పసిడి స్ఫటికాలని తేలింది.

అసలు ఈ బంగారం గాల్లోకి ఎలా వస్తోంది?

అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయువుల్లో బంగారం జాడలు కనిపించడం సైన్స్‌ ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో హవాయిలోని కీలావేయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలాస్కాలోని అగస్టిన్ అగ్నిపర్వతాల్లోనూ స్వల్పంగా బంగారం జాడలు కనుగొన్నారు. భూమి లోపలి పొరల్లో ఉండే బంగారం క్లోరిన్ లేదా సల్ఫర్ వంటి సమ్మేళనాలతో కలిసి, వేడి వాయువుల రూపంలో పైకి వస్తుంది. ఆ వాయువులు గాల్లోకి వచ్చి చల్లబడినప్పుడు, బంగారం విడిపోయి స్ఫటికాలుగా మారుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. అయితే మౌంట్ ఎరెబస్ మాత్రం మిగిలిన వాటి కంటే పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తూ భారీ మొత్తంలో బంగారాన్ని విడుదల చేస్తోంది.

మూడు దశాబ్దాలుగా వీడని మిస్టరీ!

ఈ అద్భుతాన్ని కనుగొని 30 ఏళ్లు దాటినా, ఈ అగ్నిపర్వతం ఇంత ప్యూర్ గోల్డ్‌ను ఎలా తయారు చేసి విడుదల చేస్తోందనేది ఇప్పటికీ ఒక వీడని పజిల్ గానే మిగిలిపోయింది. దీనిపై పరిశోధకులు రెండు అంచనాలను ముందుకు తెచ్చారు

  • వాయువుల్లోని క్లోరిన్ చల్లబడినప్పుడు నేరుగా గాల్లోనే ఈ బంగారం స్ఫటికాలుగా మారుతుండవచ్చు. కానీ వాయువుల్లో బంగారం పరిమాణం చాలా తక్కువ కాబట్టి ఇది అంత సులువు కాదు.
  • ఈ బంగారు స్ఫటికాలు మొదట లావా సరస్సు ఉపరితలంపై చాలా నెమ్మదిగా పెరిగి, ఆ తర్వాత వాయువుల ఒత్తిడికి గాల్లోకి ఎగురుతుండవచ్చు.
  • ఈ రెండు ఆలోచనల్లో ఏది నిజమనేది ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. అంటార్కిటికా మంచు ఖండం గుండెల్లో దాగున్న ఈ 'బంగారు రహస్యం' ఇప్పటికీ భూగోళంపై ఉన్న అతిపెద్ద శాస్త్రీయ మిస్టరీలలో ఒకటిగా కొనసాగుతోంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+