అమెరికాలో భారత దంపతుల దారుణ హత్య: మాజీ ప్రియుడు అరెస్టు !
కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన సరేనా ప్రభు, రాయల్ సిక్వేరా ప్రభు దంపతులను అమెరికాలో ఉన్న కుమార్తె ను చూడటానికి వెళ్లారు. దంపతుల కుమార్తె మాజీ ప్రియుడు మీర్జా టాట్లిక్ (24) రివాల్వర్ తో కాల్చి దార
బెంగళూరు: కుమార్తెను చూడటానికి అమెరికాకు వెళ్లిన దంపతులు దారుణ హత్యకు గురైనారు. కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన దంపతులు అమెరికాలో హత్యకు గురైనారని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మంగళూరుకు చెందిన సరేనా ప్రభు, రాయల్ సిక్వేరా ప్రభు దంపతుల కుమార్తె అమెరికాలో నివాసం ఉంటున్నారు. కుమార్తెను చూడటానికి ఇటీవల సరేనా ప్రభు, రాయల్ సిక్వేరా ప్రభు దంపతులు అమెరికా వెళ్లారు. ఆ సందర్బంలో సరేనా ప్రభు, రాయల్ సిక్వేరా ప్రభు దంపతులను తుపాకితో కాల్చి చంపారు.

సరేనా ప్రభు, రాయల్ సిక్వేరా ప్రభు దంపతుల కుమార్తె మాజీ ప్రియుడు మీర్జా టాట్లిక్ (24) అనే యువకుడు రివాల్వర్ తో కాల్చి చంపాడని అమెరికా పోలీసులు తెలిపారు. సరేనా ప్రభు, రాయల్ సిక్వేరా ప్రభు దంపతులను హత్య చేసి తప్పించుకుని పారిపోతున్న మీర్జా టాట్లిక్ అమెరికా పోలీసులు కాల్పులు జరిపి ప్రాణాలతో పట్టుకున్నారు. మీర్జా టాట్లిక్ మానసిక అస్వస్థతకు గురైనాడని అమెరికా పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications