ఎన్నికల స్టంట్, పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు బంపర్ ఆఫర్, హయ్యారే !
బెంగళూరు/హాసన్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు పార్టీల నాయకులు ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు ఉచిత హామీలు ఇచ్చేశారు. జేడీఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పేదలు. రైతులు, పెళ్లి చేసుకునే యువతులు, నిరుద్యోగులతో పాటు పలు వర్గాలకు చెందిన వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
గురువారం బెంగళూరులోని జేపీ భవన్ లో జేడీఎస్ దళపతులు మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ. మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామితో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకునే యువతకులకు జేడీఎస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

జనతా మిత్రా పేరుతో ప్రజల అభిప్రాయాలు సేకరించి తాము ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశామని, మేము ఇచ్చే ఈ హామీలు నేరవేరుస్తామని హామీ ఇస్తున్నామని జేడీఎస్ పార్టీ తెలిపింది. జేడీఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు సంవత్సరాలు తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ప్రజలకు హామీ ఇచ్చారు.

* వ్యవసాయం చేసే యువకులు (రైతులు)ను వివాహం చేసుకునే యువతులకు రూ. 2 లక్షల ప్రోత్సహ నగదు అందిస్తారు.
*కర్ణాటకలోని ప్రతి జిల్లాలోని ప్రతిఒక్క ఆటో డ్రైవర్ కు ప్రతినెల రూ. 2, 000 నగదు సహాయం.
* ప్రభుత్వ గుర్తింపు పొంది రిజిస్టర్ అయిన సెక్యూరిటీ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ప్రతినెల రూ. 2,000 నగదు సహాయం అందిస్తామని హామీలు ఇచ్చారు.
* కర్ణాటకలోని 57, 91, 032 మంది సీనియర్ సిటిజన్లు, ధారిద్రరేఖ దిగువున ఉన్న 42, 35, 609 మంది సీనియర్ సిటిజన్లకు ప్రతినెల ఇస్తున్న రూ. 1.200 పించను రూ. 5, 000కు పెంచుతామని జేడీఎస్ హామీ ఇచ్చింది.
* గర్బిణిలకు ఆరు నెలల పాటు ప్రతినెల రూ. 6 వేలు ఆర్థిక సహాయం.
* విధవా వేతం ప్రతినెల ఇస్తున్న రూ. 900 కు బదులుగా ప్రతినెల రూ. 2,500 ఇస్తామని హామీ.
* అంగనవాడి కేంద్రంలో పని చేస్తున్న కార్యకర్తలకు ప్రతినెల రూ. 11, 000, సహాయకులకు రూ. 6, 500, మిని అంగన్ వాడి కార్యకర్తలకు ప్రతినెల రూ. 7, 500 ఇస్తామని జేడీఎస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 15, 000 వేస్తామని, ప్రతి ఇంటికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని జేడీఎస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications