మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ : కమలం v/s హస్తం.. అధికారం వారిదే? .. సీఎం ఎవరంటే !!

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. దీంతో అధికారం ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విజయం మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అంచాలు వేసుకుంటున్నాయి. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ప్రస్తుతం అదికారంలో ఉన్న పార్టీ మరోసారి తన సత్తాను చాటుకుంటుందా.. లేదా.. కొత్త పార్టీకి ఓటర్లు పట్టం కట్టనున్నారా.? అనే పలు అంశాలపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించాయి.

బీజేపీకే పట్టం - ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే

బీజేపీకే పట్టం - ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే

మణిపూర్ లో మొత్తం 60 సీట్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ , కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వారి మధ్య పోటా పోటీ నెలకొందని చెబుతున్నాయి. అయితే ఎక్కువ శాతం బీజేపీ పార్టీయే మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్నాయి.

ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే ప్రకారం బీజేపీ 23 నుంచి 27 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తేలిపింది. అటు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్పీఎఫ్ 2 నుంచి 6 వరకు, ఇతరులు 5 నుంచి 9 వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని సర్వేలో వెల్లడించింది.

కాంగ్రెస్ ఆశలు గల్లంతే .. రిపబ్లిక్ - పీ మార్క్ పోల్స్

కాంగ్రెస్ ఆశలు గల్లంతే .. రిపబ్లిక్ - పీ మార్క్ పోల్స్

అటు రిపబ్లిక్ మరియు పీ మార్క్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం బీజేపీ 31 నుంచి 37 స్థానాల్లో గెలుచుకోనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడనున్నట్లు సర్వే తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 19 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అటు ఎన్పీఎఫ్ 3 నుంచి 9 స్థానాలు, ఇతరులు రెండు స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

కమలానికే జై కొట్టిన పోల్స్ పోల్ సర్వే

కమలానికే జై కొట్టిన పోల్స్ పోల్ సర్వే

అటు పోల్స్ పోల్ సర్వే ప్రకారం మణిపూర్ లో బీజేపీయే మరోసారి అధికారం కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. బీజేపీ 27 నుంచి 32 స్థానాలలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 22 సీట్లకు పరిమితమై ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషించనుందని వెల్లడించింది. ఎన్పీఎప్ 3 నుంచి 7 స్థానాలకు పరిమితం కానుంది. ఇతరులు 3 నుంచి 5 సీట్లను సొంత చేసుకుంటారని సర్వేలో తేలింది.

బీరెన్ సింగ్ కే మళ్లీ పగ్గాలు

బీరెన్ సింగ్ కే మళ్లీ పగ్గాలు

సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీరెన్ సింగ్ ఉన్నారు. ఈసారి కూడా ఆయనేనే సీఎంగా కోరుకుంటున్నట్లు సర్వేలను బట్టి తేలుస్తోంది. అయితే ఈ మణిపూర్ పోస్ట్ పోల్స్ ఫలితాలు తుది ఫలితాలకు అనుగుణంగా ఉంటాయా.. లేదా.. తలకిందులవుతాయో తేలాలంటే మార్చి 10 వ తేది వరకు ఆగాల్సిందే.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీబీజేపీకే అనుకూలంగా రావడంతో కమలం నేతలు గెలుపుపై మరింత ధీమాతో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+