Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం, స్పీకర్ భవితవ్యం తేలేది ఈ రేసులోనే: తొలిదశ పోలింగ్ ప్రారంభం

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. తొలివిడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 173 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, అసెంబ్లీ స్పీకర్ వై ఖేమ్‌చంద్ సింగ్, ఉప ముఖ్యమంత్రి యుమ్మన్ జోయ్ కుమార్ సింగ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ లోకేష్ సింగ్.. భవితవ్యం తేలేది ఈ తొలి రేసులోనే.

రెండో విడతలో మిగిలిన 22 స్థానాలకు పోలింగ్.. మార్చి 5వ తేదీన నిర్వహించేలా షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ రెండు దశల్లో మొత్తం 20,56,901 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికోసం 2,959 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు.

ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా హీన్‌గ్యాంగ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. కొద్దిసేపటి కింటే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని ఇంఫాల్‌లోని ష్రీవన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లడానికి ముందు ఆయన తన నివాసంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పోలింగ్ బూత్‌కు చేరుకున్న తరువాత కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

Manipur Assembly Elections 2022 : Polling for the first phase begins in 38 constituencies

ప్రజాస్వామ్యంలో పోలింగ్ అనేది అతిపెద్ద పండగ అని.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వరుసగా రెండోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసం ఉందని అన్నారు. తన నియోజకవర్గంలో 75 శాతం మంది ఓటర్లు తమ పార్టీ వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. తొలిదశలో ఎన్నికలను ఎదుర్కొంటోన్న 38 నియోజకవర్గాల్లో 30 స్థానాల్లో తాము జెండా ఎగురవేస్తామని బీరేన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

మణిపూర్ ప్రజలు- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన పనితీరు, నాయకత్వం పట్ల బలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారని బీరేన్ సింగ్ చెప్పారు. ఈ అయిదు సంవత్సరాల్లో తాము చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మళ్లీ గెలిపిస్తాయని అన్నారు. మణిపూర్‌పై పట్టు సాధించడానికి కాంగ్రెస్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న చేరికలు ఆ పార్టీ విజయానికి బాటలు వేస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+