మణిపూర్ బీజేపీదే : ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టీవీ-సీఓటర్ సర్వే అంచనా
15 ఏళ్లుగా కాంగ్రెస్ చేతుల్లో ఉన్న మణిపూర్ లో ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
న్యూఢిల్లీ: మణిపూర్ లో బీజేపీకి మెజారిటీ రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 15 ఏళ్లుగా ఈ రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. మణిపూర్ లో బీజేపీకి 25-31 సీట్లు, కాంగ్రెస్ కు 17-23 సీట్లు, ఇతరులకు 9-15 సీట్లు వస్తాయని ఇండియా టీవీ-సీఓటర్ సర్వే అంచనా వేసింది.
మణిపూర్ లో మొత్తం స్థానాలు 60 కాగా.. మ్యాజిక్ ఫిగర్ 31. ఒకవేళ అంచనాలు నిజమైతే 2012 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీకి ఇది భారీ విజయమే అవుతుంది.













Click it and Unblock the Notifications