కుకీలను హెచ్చరించిన మెయితీ: మణిపూర్‌లో తాజా ఉద్రిక్తత..!!

న్యూఢిల్లీ: మణిపూర్‌లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.

మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు చెలరేగి ఇవ్వాళ్టికి.. సరిగ్గా మూడు నెలలు అవుతోంది. మే 3వ తేదీన అక్కడ మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి 160 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్.

Manipur Kuki group leaders plan to bury the 35 bodies at S Boljang

ఈ పరిస్థితుల్లో తాజా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చురచంద్‌పూర్ జిల్లాలో మెయితీల చేతిలో దారుణ హత్యకు గురైన 35 మంది మృతదేహాలను ఇవ్వాళ సామూహికంగా ఖననం చేస్తామంటూ కుకీ గిరిజన వేదిక నాయకులు ప్రకటించడం ఉద్రిక్తతలకు కారణమైంది. దీన్ని అడ్డుకుంటామంటూ మెయితీలు ప్రకటించారు.

జిల్లాలోని ఎస్ బోల్జాంగ్‌లో గల టుయిబుంగ్ పీస్ గ్రౌండ్‌లో ఈ అంత్యక్రియలు జరుగుతాయని గిరిజన నాయకులు వెల్లడించారు. లామ్కా మార్చరీలో 35, ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరి కొన్ని కుకీల మృతదేహాలు ఉన్నాయి. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం వాటిని ఆయా ఆసుపత్రుల్లో భద్రపరిచారు.

ఇంఫాల్ నుంచి మిగిలిన అమరవీరుల మృతదేహాలను కూడా ప్రభుత్వం పంపితే, వాటిన్నింటినీ కలిపి ఖననం చేస్తామని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ ప్రతినిధి గింజా వుల్‌జాంగ్ ప్రకటించారు. మృతులకు ఘనంగా నివాళి అర్పించడానికి మించి ఇంకేమీ చేయలేమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

బోల్జాంగ్‌లో సామూహిక ఖననానికి మెయితీలు వ్యతిరేకిస్తోన్నారు. దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్ సమగ్రతపై ఏర్పాటైన కోఆర్డినేషన్ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సామూహిక ఖననాకి పూనునకోవడం స్థానికుల మనోభావాలను రెచ్చగొట్టడమే అవుతుందని, శాశ్వత శతృత్వానికి దారి తీస్తుందని హెచ్చరించింది. మృతుల స్వగ్రామాల్లోనే అంత్యక్రియలను నిర్వహించుకోవాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+