చారిత్రక మైలురాయి: మణిపూర్ యూఎన్ఎల్ఎఫ్‌తో శాంతి ఒప్పందం విజయవంతం
న్యూఢిల్లీ: మణిపూర్ రాష్ట్రంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గత కొంత కాలంగా ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ (Manipur) రాష్ట్రంలో శాంతియువత వాతావరణం నెలకొల్పేందుకు కీలక ముందడుగు పడింది. ఇంఫాల్ లోయలోని తిరుగుబాటు గ్రూప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF)తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతి చర్చలు విజయవంతమయ్యాయి.

ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం ట్విట్టర్(ఎక్స్) వేదికగా ప్రకటించారు. చారిత్రక మైలురాయిని అధిగమించామని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ శాంతి ఒప్పందంపై బుధవారం సంతకం చేసిందని అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. దీంతో ఈశాన్య ప్రాంతంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు నేటితో నెరవేరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement.
— Amit Shah (@AmitShah) November 29, 2023
It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1
మణిపూర్ రాష్ట్రంలోని సాయుధ సమూహంగా ఉన్న యూఎన్ఎల్ఎఫ్ హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అంగీకారం తెలిపిందని అమిత్ షా వెల్లడించారు. వారందరినీ ప్రజాస్వామ్య ప్రక్రియలోకి స్వాగతిస్తున్నామన్నారు. శాంతి, అభివృద్ధి మార్గంలో వారి ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు తుపాకీలను వీడిన ఫొటోలను అమిత్ షా సోసల్ మీడియాలో పంచుకున్నారు.
A historic milestone achieved!!!
— Amit Shah (@AmitShah) November 29, 2023
Modi govt’s relentless efforts to establish permanent peace in the Northeast have added a new chapter of fulfilment as the United National Liberation Front (UNLF) signed a peace agreement, today in New Delhi.
UNLF, the oldest valley-based armed… pic.twitter.com/AiAHCRIavy
మే 3న చెలరేగిన హింసాత్మక ఘటనలతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తమ ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతోందని వెల్లడించారు. అప్పుడు ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ.. తాజా పరిణామంతో యూఎన్ఎల్ఎఫ్ గురించే పేర్కొన్నట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆకాంక్షిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications