మణిపూర్‌లో మళ్లీ హింస: కుకీ నేత ఇంటికి నిప్పుపెట్టిన గుంపు
Manipur Violence: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. చురాచంద్‌పూర్ జిల్లాలో ఒక కుకీ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో నాయకుడి ఇంటికి కూడా నిప్పు పెట్టడానికి ప్రయత్నించగా.. ప్రజలు అడ్డుకొని ఆపారు. ఈ విషయాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. కుకీ నేషనల్ ఆర్గనైజేషన్‌కు చెందిన నాయకుడు కెల్విన్ ఐఖెన్‌థాంగ్ నివాసానికి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుంపు నిప్పుపెట్టిందని అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మరో కుకీ నాయకుడు గింజా వుయల్‌జాంగ్ ఇంటిని కూడా గుంపు లక్ష్యంగా చేసుకుంది. అయితే స్థానికులు జోక్యం చేసుకుని ఇంటికి నిప్పు పెట్టకుండా కాపాడారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణలతో సెప్టెంబర్ 12న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అరెస్టులకు నిరసనగా జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ మొత్తం సంఘటన ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనకు కొద్ది రోజుల ముందు జరిగింది.

సైన్యం మోహరింపు.. భద్రత కట్టుదిట్టం
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సైన్యం అక్కడికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. అంతే కాకుండా ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అధికారులు మాట్లాడుతూ.. కేఎన్ఓ (KNO), యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్‌తో ఎస్ఓఓ (SOO) ఒప్పందాలపై సంతకం చేయడం వల్ల శాంతి స్థాపన ప్రయత్నాలపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, కుకీ వర్గానికి చెందినవారు మణిపూర్ గుండా వెళ్లే జాతీయ రహదారి-2ను ప్రయాణికులు, నిత్యావసర వస్తువుల రాకపోకలకు వీలుగా తెరిచేందుకు నిర్ణయించారు.
'భద్రతా బలగాలకు సహకరించాలి'
అయితే, సోమవారం కేజెడ్సీ (KZC-Kuki-Zo Council) ఒక ప్రకటన చేస్తూ, జాతీయ రహదారి-2ను తిరిగి తెరిచినట్లు తాము ప్రకటించలేదని, ఈ మార్గంలో ఎటువంటి స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కేజెడ్సీ ఒక ప్రకటనలో, "మా అభ్యర్థన కేవలం కాంగ్‌పోక్పీ జిల్లా ప్రజలకు మాత్రమే. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జాతీయ రహదారి-2పై ప్రయాణికుల భద్రతను కాపాడటానికి భద్రతా బలగాలకు సహకరించాలని మాత్రమే కోరాం" అని పేర్కొంది. ఈ ప్రకటన "తప్పుగా అర్థం చేసుకోబడిందని, అనవసరమైన గందరగోళాన్ని సృష్టించిందని కేజెడ్సీ (KZC-Kuki-Zo Council) పేర్కొంది. మైతీ, కుకీల మధ్య సంఘర్షణకు ఇంకా పరిష్కారం లేదా ఏకాభిప్రాయం కుదరనందున, ఏ వర్గానికి చెందిన వ్యక్తి కూడా సంబంధిత ప్రాంతాలలోకి ఎటువంటి పరిస్థితులలోనూ ప్రవేశించకూడదని కౌన్సిల్ తెలిపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications