ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఇంటిపై సిబిఐ దాడులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి అపవాదు ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై శుక్రవారం నాడు సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.
పెద్ద మొత్తంలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల కిందట సిసోడియా నివాసం , ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు.

ఢిల్లీ ప్రజలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమేకమయ్యే కార్యక్రమం అయిన టాక్ టూ ఏకే అనే పేరిట అక్రమాలకు పాల్పడ్డారని పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకొని అవినీతి చర్యలకు డిగారని సీబిఐకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో గత జనవరిలోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ప్రశ్నిస్తున్నట్టు కూడ తెలుస్తోంది.












Click it and Unblock the Notifications