‘కాశ్మీర్‌తో హోగా.. పాకిస్థాన్ నహీ హోగా’: ఆ సైనికుడికి బెదిరింపులు
న్యూఢిల్లీ: 'కాశ్మీర్‌తో హోగా.. పాకిస్థాన్ నహీ హోగా' అంటూ కాశ్మీర్‌లోని యూరీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడిన అనంతరం పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ మన సైన్యంతోపాటు భారతీయుల్లో స్ఫూర్తి నింపేలా పాట పాడిన సైనికుడు మనోజ్ ఠాకూర్‌కు బెదిరింపులు ఎదురవుతున్నాయి.
'పాకిస్థాన్ చెవులు రిక్కించి విను.. భారత్‌తో పెట్టుకుంటే ప్రపంచ పటంలో నీ రూపురేఖలు లేకుండా పోతాయి. కశ్మీర్ ఉంటుంది గానీ.. పాకిస్థాన్ మాత్రం ఉండదు' అంటూ గీతాన్ని ఆలపించారు. కాగా, ఈ పాట వైరల్‌గా మారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

వీర జవాన్లకు సలాం చెబుతూ.. అనేకమంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు.
అయితే ఇప్పుడు మనోజ్ ఠాకూర్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అతడిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని తోటి సైనికులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ ఠాకూర్‌కు కిన్నౌర్ ప్రాంతానికి పోస్టింగ్ వేశారు.

యూరీ ఉగ్రదాడిలో సుమారు 20మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మన సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం భారత సైనికులు.. పీవోకేలో జరిపిన సర్జికల్ దాడుల్లో సుమారు 40మందికిపైగా ఉగ్రవాదులు హతయ్యారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications