పార్లమెంట్ దాడికి ముందు మనోరంజన్ ఏం చేశాడంటే?, భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ లో?, షాకింగ్ మ్యాటర్!
పార్లమెంట్ సందర్శకుల గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన ఇద్దరు నిందితుల్లో ఒక్కడైన డి. మనోరంజన్ 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్' అనే సోషల్ మీడియా పేజీతో సంబంధం కలిగి ఉన్నాడని, అసెంబ్లీలో బాంబులు విసిరిన భగత్ సింగ్ చర్యను పునరావృతం చేయాలని అతను అనుకున్నాడని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మనోరంజన్ తనను తాను విప్లవకారుడిగా గుర్తించుకోవడం ఇష్టమని పోలీసు అధికారులు తెలిపారు.
పార్లమెంట్ లో కలకలం రేపిన నిందితుడు మనోరజంన్ కు గతంలో ఎలాంటి నేర నేపథ్యం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మనోరంజన్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని, కానీ అతను చదివిన పుస్తకాలను చూస్తుంటే అతను తాను విప్లవకారుడు అని అందరితో పిలిపించుకోవాలని అనుకున్నాడని కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.

గతంలో ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీపై ప్రతీకాత్మకంగా బాంబు పేల్చిన భగత్ సింగ్ అభిమానిగా తాను గుర్తింపు తెచ్చుకోవాలని మనోరంజన్ అనుకున్నాడని మరో పోలీసు అధికారి తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్, ఆయన బృందం చేసిన వాటిని పునరావృతం చేయాలనుకుంటున్నట్లు మనోరంజన్ అతని సన్నిహితులతో చెప్పారని పోలీసు అధికారి తెలిపారు.
బుధవారం పార్లమెంటు వెలుపల నిరసన తెలిపిన నీలం దేవి, ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన రెజ్లర్ల నిరసనలో పాల్గొని భగత్ సింగ్ చిత్రపటంతో తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వెలుగు చూసింది. పార్లమెంటు దాడికి ముందు నీలమ్ ఆమె X (ట్విట్టర్) చివరి పోస్ట్‌లో పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 50 శాతం కోటా ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారని పోలీసు అధికారులు తెలిపారు.

బుధవారం నాడు 2001 పార్లమెంటు ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన భారీ భద్రతా ఉల్లంఘనలో మనోరంజన్, అతని సహచరుడు సాగర్ శర్మ జీరో అవర్‌లో పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌కి దూకారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో మనోరంజన్, సాగర్ శర్మాలు నినాదాలు చేశారు. పసుపు పొగ బాంబు విసిరి నానా హంగామా చేశారు.
అదే సమయంలో నీలం, మరో నిందితుడు అమోల్ షిండే పార్లమెంటు బయట నిరసన ప్రదర్శన నిర్వహించి స్మోక్ బాంబులు పేల్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటు ఆవరణంలో నియంతృత్వం పనిచేయదని నినాదాలు చేశారు. ఈ నలుగురితో సహా ఐదుగురిని అరెస్టు చేసి కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అభియోగాలు మోపారు. అయితే ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications