వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Inspirational Story: చేయి చేయి కలిపారు.. చేయూతనందించారు..

|
Google Oneindia TeluguNews

సమాజంలో అంత ఒకలా ఉండరు. ఒక్కొక్కరి ఒక్కో కష్టం ఉంటుంది. అయితే కష్టం వచ్చిన వారిని ఆదుకునేది ఎవరు అంటే.. మనమే.. అవును మనిషికి మనిషే సాయం చేయాలి. ఇలానే ఓ పేద మహిళకు చేయి కలిపి సాయం చేశారు ప్రజలు. ఈ ఘటన కేరళలో జరిగింది. కేరళలో నివస్తున్న సుభద్ర, భర్త పిల్లలతో కలిసి ఉండేది. కొద్ది రోజుల క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతో వారి కుటుంబం దిక్కలేనిది అయింది. సుభద్ర కష్టం చేస్తే వారికి ఆహారం లభించేది.

అయితే ఆమె రూ.500 అవసరం వచ్చింది. తన దగ్గర డబ్బు లేకపోవడంతో తన కొడుకు చదువుతున్న పాఠశాలలో ఉపాధ్యాయురాలిని రూ. 500 అప్పు అడిగింది. సుభద్ర కుటుంబం దీనస్థితిని చూసిన టీచర్ సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 25, 2022 నాటికి సుభద్ర కుటుంబానికి 5.5 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయి.

Many people donated and helped a poor woman in Kerala

సుభద్ర భర్త ఆగస్టులో మరణించాడు. అప్పటి నుంచి సుభద్ర తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆమె ముగ్గురు కుమారులలో చిన్నవాడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతన్ని చూసుకోవడానికి ఎవరు లేకపోడంతో ఆమె అతన్ని చూసుకుంటు చిన్న చిన్న పనులకు వెళ్లేది. వారికి డబ్బులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడే వారు. ఈ క్రమంలో సుభద్ర ఉపాధ్యాయురాలి సాయం అడిగింది.

సుభద్ర కష్టాలపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ ఉపాధ్యాయురాలు పోస్ట్ పెట్టారు. ప్రజలు తమ స్థోమత ఉన్న డబ్బు పంపి సహాయం చేయాలని కోరారు. ఆమె పోస్ట్‌లో సుభద్ర బ్యాంక్ ఖాతా వివరాలను కూడా పెట్టారు. పోస్ట్ వైరల్ అయింది. దీంతో సుభద్ర ఖాతాలో దయగల అపరిచితుల నుంచి 5.5 మిలియన్ రూపాయలను జమ అయ్యాయి.

English summary
A woman in Kerala has collected Rs.5 lakh through crowdfunding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X