Loksabha Election 2024: 2024లో అధికారం మళ్లీ బీజేపీదే.. సర్వేల్లో వెల్లడి..!

కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. నరేంద్ర మోడీ బలమైన నేతగా ఉండడంతో కాషాయ పార్టీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఓపీనియన్ పోల్ లో తేలింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 318 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక విపక్షాల కూటమికి 175, ఇతరులకు 50 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది.

మే నెలాఖరులో ఎన్డీటీవీ- సీఎస్డీఎస్ సర్వే కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. అత్యధికంగా 43 శాతం మంది మోడీ ప్రధాని అని చెప్పగా.. 16 శాతం మంది రాహుల్ గాంధీ ప్రధాని అయితే బాగుంటుందని చెప్పారు. మోడీ 9 ఏళ్ల పాలనలో ఎలాంటి అవినీతి లేకపోవడం ఆ పార్టీ కలిసొచ్చినట్లు సర్వేలు పేర్కొన్నాయి. బీజేపీ కూడా మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది.

Many surveys predict that the BJP will once again come to power in the 2024 Lok Sabha elections

అందుకే గత నెలలో ఎన్డీయే పక్షాల మీటింగ్ నిర్వహించింది. కాషాయ పార్టీకి దూరమైన లోక్ జనశక్తి, అకాలీదళ్ ఇప్పుడు తిరిగి ఎన్డీయేలో చేరాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈసారి అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు ఏకమై ఇండియా పేరుతో కొత్త జట్టు కట్టాయి. ఇందులో 26 పార్టీలున్నాయి. బీజేపీ పాత మిత్రుడు, బీహార్ సీఎం నీతిశ్ కుమార్ ఈ సారి ప్రతిపక్ష కూట మిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

అయితే బీజేపీకి సులభంగా విజయం దక్కకపోవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బీజేపీకి దక్షణాది కంటే ఉత్తరాదిలో బలం ఎక్కువ ఉంటుందని తేల్చేశాయి. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీగా, బలమైన ప్రతిపక్షంగా ఉంది. గుజరాత్, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. బెంగాల్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాలతో పాటు ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో ప్రతిపక్షంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+