మావోయిస్టుల ఘాతుకం: ఐఈడీతో వాహనం పేల్చివేత: 16 మంది కమాండోలు దుర్మరణం
ముంబై: మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. రక్తపాతానికి తెగబడ్డారు. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ.. భారీ పేలుళ్లతో విరుచుకు పడ్డారు. కమాండోల వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో సీ-60 బెటాలియన్ కు చెందిన 16 మంది కమాండోలు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కమాండోలను వాహనాన్ని పేల్చి వేయడానికి మావోయిస్టులు ఐఈడీని ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం. శక్తిమంతమైన ఐఈడీ మావోయిస్టుల చేతికి ఎలా చేరిందనే విషయం చర్చనీయాంశమౌతోంది.

మావోయిస్టులకు కంచుకోటగా భావించే ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది గడ్చిరోలి జిల్లా. ఈ జిల్లాలో ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న కుర్ ఖేడా- జముర్ ఖేడా మార్గంలో ప్రయాణిస్తున్న కమాండోల వాహనాన్ని మావోయిస్టులు పేల్చి వేశారు. కూంబింగ్ నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనంలో డ్రైవర్ సహా మొత్తం 15 మందికి పైగా కమాండోలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఐఈడీతో వాహనాన్ని పేల్చివేయడం వల్ల 16 మంది దుర్మరణం పాలయ్యారు.

కుర్ ఖేడా ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున మావోయిస్టులు తమ ఉనికి చాటుకున్న విషయం తెలిసిందే. కుర్ ఖేడాలో వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టారు. ఒకేసారి 36 వాహనాలను తగులబెట్టారు మావోయిస్టులు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కమాండోలు సంఘటనా స్థలానికి బయలుదేరారు. వాహనాలను తగులబెట్టిన ప్రదేశానికి పోలీసులు గానీ, కమాండోలు గానీ రావచ్చని ఊహించిన మావోయిస్టులు దీనికి అనుగుణంగా ఐఈడీని పాతిపెట్టారు. కుర్ ఖేడా-జముర్ ఖేడా మార్గంలో కమాండోల వాహనం రాగానే.. దాన్ని పేల్చివేశారు.

సాధారణంగా మావోయిస్టులు ఎప్పుడు దాడి చేసినా.. మందుపాతరలను వినియోగిస్తారు. వాటితోనే విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల్లో మందుపాతరలతో సీఆర్పీఎఫ్, పోలీసుల వాహనాలను పేల్చి వేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ సారి మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీలను వినియోగించడం పట్ల పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పెద్ద ఎత్తున ఐఈడీని మావోయిస్టులు ఎలా సమకూర్చుకున్నారనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐఈడీ మావోయిస్టులకు ఎలా చేరిందనే విషయంపైనా వారు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications