Marriage: 45 ఏళ్ల పొలిటికల్ లీడర్, 25 ఏళ్ల యువతి లవ్ మ్యారేజ్, ఐదు నెలలకే భర్త ఆత్మహత్య, మ్యాటర్ !
బెంగళూరు/తుమకూరు: రాజకీయాల్లో ఉంటున్న 45 ఏళ్ల వ్యక్తి, 25 ఏళ్ల మహిళ వివాహం చేసుకోవాలని అనుకున్న సమయంలో ఊర్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఇష్టపడిన తరువాత మనం చేసేది ఏముంది అంటూ ఊర్లోవాళ్లు అనుకున్నారు. చివరికి కుటుంబ సభ్యులు, బంధువులు, ఊర్లోని కొందరు ప్రజలు, రాజకీయ నాయకులు కలిసి ఆ ఇద్దరికి గుడిలో వివాహం జరిపించారు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కలిసి కాపురం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు వారి బందువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి వచ్చారు. ఇంట్లో టీ తాగిన పొలిటికల్ లీడర్ తరువాత తోట దగ్గరకు వెళ్లాడు. తోటలోని చెట్టుకు ఆ పొలిటికల్ లీడర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. ఉదయం ఊర్లో వారిని పలకరించి వెళ్లిన పొలిటికల్ లీడర్ కొన్ని గంటల్లోనే శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. వివాహం చేసుకున్న ఐదు నెలలకే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన బంధువులు హడలిపోయారు. పొటిలికల్ లీడర్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో డెత్ నోట్ చిక్కిందని సమాచారం. అయితే పోలీసులు ఆ డెత్ నోట్ లోని వివరాలు, అందులో ఏముంది అనే విషయంలో సమాచారం ఇవ్వడం లేదని స్థానికులు అంటున్నారు. ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్న వీరి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పొలిటికల్ లీడర్
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలుకాలోని హులియూరు దుర్గ సమీపంలోని అక్కిమరిపాళ్యలో శంకరన్న అలియాస్ శంకర్ (45) నివాసం ఉంటున్నారు, శంకరన్న గ్రామ పంచాయితీ మాజీ సభ్యుడు. రాజకీయాల్లో ఉంటున్న శంకరన్నను ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది.

25 ఏళ్ల మహిళ భర్త మాయం
శంకరన్న నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోని సంతోమావత్తూరు గ్రామంలో మేఘనా (25) అనే మహిళ నివాసం ఉంటున్నది. మేఘనాకు గతంలో వివాహం అయ్యింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మేఘనా భర్త రెండు సంవత్సరాలు అయినా తిరిగిరాలేదు.. భర్త మాయం కావడంతో మేఘనా రెండు సంవత్సరాలు ఒంటరిగానే గడిపింది.

పెళ్లి చేసుకోవాలని చెప్పిన మేఘనా
శంకరన్న భార్య కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది. తనను వివాహం చేసుకోవాలని మేఘనా నేరుగా వెళ్లి శంకరన్నకు చెప్పింది. భర్త దూరం అయ్యి ఒంటరిగా ఉంటున్న మేఘనాను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితం ఇవ్వాలని శంకరన్న అనుకున్నాడు. ఇదే విషయంలో శంకరన్న, మేఘనా వారి కుటుంబ సభ్యులు, బంధువులతో చర్చలు కూడా జరిపారు.

ఐదు నెలల క్రితం పెళ్లి
రాజకీయాల్లో ఉంటున్న 45 శంకరన్న, 25 మేఘనా వివాహం చేసుకోవాలని అనుకున్న సమయంలో ఊర్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఇష్టపడిన తరువాత మనం చేసేది ఏముంది అంటూ ఊర్లోవాళ్లు అనుకున్నారు. చివరికి కుటుంబ సభ్యులు, బంధువులు, ఊర్లోని కొందరు ప్రజలు, రాజకీయ నాయకులు కలిసి శంకరన్న, మేఘనాలకు 2021 అక్టోబర్ నెలలో ఊర్లోని గుడిలో వివాహం జరిపించారు.

అంత ఓకే అనుకున్నారు
వివాహం చేసుకున్న శంకరన్న, మేఘనా దంపతులు సంతోషంగా కలిసి కాపురం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తరువాత శంరన్న, మేఘనా దంపతులు వారి బందువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి వచ్చారు. వయసులో తేడా ఉన్నా శంకరన్న, మేఘనా దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారని ఇంతకాలం అందరూ అనుకున్నారు.

టీ తాగి వెళ్లి శవమైన పొలిటికల్ లీడర్
ఇంట్లో టీ తాగిన పొలిటికల్ లీడర్ శంకరన్న తరువాత ఆయన సొంత తోట దగ్గరకు వెళ్లాడు. తోటలోని చెట్టుకుశంకరన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. ఉదయం ఊర్లో వారిని పలకరించి వెళ్లిన పొలిటికల్ లీడర్ శంకరన్న కొన్ని గంటల్లోనే శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.
Recommended Video


పెళ్లైన ఐదు నెలలకే ఆత్మహత్య
వివాహం చేసుకున్న ఐదు నెలలకే శంకరన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన బంధువులు హడలిపోయారు. పొటిలికల్ లీడర్ శంకరన్న ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో డెత్ నోట్ చిక్కిందని సమాచారం. అయితే పోలీసులు ఆ డెత్ నోట్ లోని వివరాలు, అందులో ఏముంది అనే విషయంలో సమాచారం ఇవ్వడం లేదని స్థానికులు అంటున్నారు. శంకరన్న ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదు, పోలీసులు శంకరన్న భార్య మేఘనాను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఐదు నెలల క్రితం శంకరన్న, మేఘనాలు పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన వీరి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications