బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Marriage: పెళ్లి కొడుక్కి 85 ఏళ్లు, పెళ్లి కూతురికి 65 ఏళ్లు, కొడుకులు, కోడళ్లు సాక్షిగా రెండో పెళ్లి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: వివాహం చేసుకున్న దంపతులకు 9 మంది కొడుకులు, కూతుర్లు ఉన్నారు. కొడుకులు, కూతుర్లు వివాహాలు చేసుకుని ఎవరికి వారు వేరువేరుగా నివాసం ఉంటున్నారు. కొడుకులు, కూతుర్ల పిల్లలతో ఆ దంపతులు కాలం గడిపారు. అవ్వాతాతల దగ్గర పిల్లలు ఆడుకుంటూ కాలం గడిపారు. అనారోగ్యంతో భార్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. ఒంటరిగా ఉంటున్న భర్తకు తోడుకావాలని ఆలోచించాడు. అదే ఏరియాలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళతో ఆయనకు ముందుగానే పరిచయం ఉంది. నీకు నేను, నాకు నువ్వు అనే సినిమా టైటిల్ టైపులో మనం కలిసి జీవిద్దామని ఇద్దరూ మాట్లాడుకున్నారు. భార్య చనిపోయిన వ్యక్తి వయసు 85 సంవత్సరాలు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వయసు 65 ఏళ్లు, ఇద్దరు పెళ్లి చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఓరిదేవుడో, ఈ వయసులో మీకు ఇదేం బుద్ది, కోడళ్లు, అల్లులు, మనుమలు, మనుమరాళ్లు ఉన్న వయసులో మీరు పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ అందరూ ఎగతాలి చేశారు. అయితే మొండిపట్టుతో ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొంతకాలం పాటు రెండు కుటుంబాల్లో హైడ్రామా నడిచింది. ఇక కొడుకులు, కొడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు కలిసి అవ్వా, తాతకు పెళ్లి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Girlfriend: అక్క మొగుడితో మరదలు, ఫస్ట్ ఎస్కేప్, ఎంజాయ్, కట్ చేస్తే కిడ్నాప్, లేడీ రివర్స్ తో!Girlfriend: అక్క మొగుడితో మరదలు, ఫస్ట్ ఎస్కేప్, ఎంజాయ్, కట్ చేస్తే కిడ్నాప్, లేడీ రివర్స్ తో!

 దంపతులకు 9 మంది పిల్లలు

దంపతులకు 9 మంది పిల్లలు

కర్ణాటకలోని మైసూరు నగరంలోని ఉదయగిరిలోని గౌసియా నగర్ లో ముస్తఫా (85), ఖుర్షీద్ బేగం దంపతులు నివాసం ఉంటున్నారు. 50 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ముస్తఫా, ఖుర్షీదా బేగం దంపతులకు 9 మంది కొడుకులు, కూతుర్లు ఉన్నారు. ముస్తఫా, ఖుర్షీద్ బేగం కొడుకులు, కూతుర్లు వివాహాలు చేసుకుని ఎవరికి వారు వేరువేరుగా నివాసం ఉంటున్నారు.

 అనారోగ్యంతో చనిపోయిన భార్య

అనారోగ్యంతో చనిపోయిన భార్య

ముస్తఫా, ఖుర్షీద్ బేగం కొడుకులు, కూతుర్ల పిల్లలతో ఆ దంపతులు కాలం గడిపారు. ముస్తఫాకు గౌసియా నగర్ లోని సోంతంగా మటన్ షాపు ఉంది. చాలా సంవత్సరాల నుంచి మటన్ షాపు నిర్వహిస్తున్న ముస్తఫా డబ్బులు బాగానే సంపాధించాడు. అవ్వాతాతల దగ్గర పిల్లలు ఆడుకుంటూ కాలం గడిపారు. అనారోగ్యంతో మస్తఫా భార్య ఖుర్షీదా బేగం రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది.

 పెళ్లి చేసుకుందాం రా

పెళ్లి చేసుకుందాం రా

భార్య చనిపోవడంతో ముస్తఫా కొన్ని రోజులు కొడుకుల దగ్గర, కొన్ని రోజులు కూతుర్ల దగ్గర కాలం గడపడం మొదలుపెట్టాడు. వయసు పెరిగిపోవడంతో ఒంటరితనంతో ముస్తఫా సతమతం అయ్యాడు. గౌసియా నగర్ లోనే నివాసం ఉంటున్న ఫాతిమా బేగం (65) అనే మహిళ భర్త చనిపోయివడంతో ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది.

 పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు

గౌసియా నగర్ ఏరియాలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఫాతిమా బేగంకు, ముస్తఫాకు ముందుగానే పరిచయం ఉంది. నీకు నేను, నాకు నువ్వు అనే సినిమా టైటిల్ టైపులో మనం కలిసి జీవిద్దామని ముస్తఫా, ఫాతిమా బేగం మాట్లాడుకున్నారు. వయోభారంతో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని ఇద్దరూ అనుకున్నారు.

 అందరూ నవ్వు కున్నారు

అందరూ నవ్వు కున్నారు

భార్య చనిపోయిన ముస్తఫాకు 85 సంవత్సరాలు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఫాతిమా బేగం వయసు 65 ఏళ్లు, ఇద్దరు పెళ్లి చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఓరిదేవుడో, ఈ వయసులో మీకు ఇదేం బుద్ది, కోడళ్లు, అల్లులు, మనుమలు, మనుమరాళ్లు ఉన్న వయసులో మీరు పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ అందరూ ముస్తఫా, ఫాతిమా బేగంను ఎగతాలి చేశారు.

 మాట వినరని అందరికి తెలిసిపోయింది

మాట వినరని అందరికి తెలిసిపోయింది

అయితే ముస్తఫా, ఫాతిమా బేగం మొండిపట్టుతో ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొంతకాలం పాటు రెండు కుటుంబాల్లో ఇద్దరి పెళ్లి విసయంలో జోరుగా చర్చలు జరిగాయి. ఇక లాభం లేదని, వీళ్లు ఎవరి మాట వినరని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

Recommended Video

Union Cabinet : Women's And Men's Age Should Be Equal To Get Married
 మొండిపట్టుతో పెళ్లి చేసుకున్న అవ్వాతాత

మొండిపట్టుతో పెళ్లి చేసుకున్న అవ్వాతాత

ముస్తఫా కొడుకులు, కొడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు కలిసి ఫాతిమా బేగం, ముస్తఫాల పెళ్లి అతని ఇంట్లోనే సింపుల్ గా చేశారు. అవ్వా, తాతల పెళ్లికి బంధువులు, తెలిసిన వాళ్లను పిలిపించి చట్టబద్దంగా అందరికి తెలిసేలా పెళ్లి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Marriage: 85 year old man married with 65 years old lady in Mysuru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X