లవర్స్‌కు కొత్త చిక్కులు.. రిజిస్ట్రేషన్‌కు ఇకపై తల్లిదండ్రుల సంతకం మస్ట్!

గుజరాత్ ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో భారీ మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది. లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి, సామాజిక వ్యవస్థను కాపాడటానికి వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తల్లిదండ్రుల ప్రమేయాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వీ ఈ కొత్త నిబంధనలను ప్రకటించారు. మారుతున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా, ఆడబిడ్డల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ కొత్త నిబంధనలు ఏమిటి?
గుజరాత్ వివాహ రిజిస్ట్రేషన్ చట్టం 2006 ప్రకారం తీసుకువచ్చిన ఈ మార్పుల వల్ల, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు అంత సులభం కాదు. కొత్త నిబంధనల ప్రకారం, వధూవరులు తమ వివాహం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు, నివాస ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు జత చేయాలి. ఈ వివరాలన్నీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించే వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి.

Marriage Registration New Rules in Gujarat Parents Consent Mandatory for Registration to Curb Love Jihad

ప్రక్రియ, గడువు
వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం కాలపరిమితిని కూడా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10 రోజుల్లోపు వధూవరుల తల్లిదండ్రులకు అధికారికంగా నోటీసు పంపుతారు. ఆ తర్వాత అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకున్నాక మాత్రమే, దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి 30 రోజుల గడువు ముగిసిన తర్వాత వివాహాన్ని రిజిస్టర్ చేస్తారు. దీనివల్ల మోసపూరిత పెళ్లిళ్లకు అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

'లవ్ జిహాద్' అరికట్టడమే లక్ష్యం
ఈ సందర్భంగా హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. కొంతమంది తమ అసలు గుర్తింపును దాచిపెట్టి గుజరాత్ ఆడబిడ్డలను ప్రేమిస్తున్నట్లు నటించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. "ఒక సలీమ్ తన పేరును సురేష్‌గా మార్చుకుని మా రాష్ట్ర ఆడబిడ్డలను ట్రాప్ చేయాలని చూస్తే, భవిష్యత్తులో అలాంటి పని చేయడానికి భయపడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది" అని ఆయన హెచ్చరించారు. ముస్లిం జనాభా అస్సలు లేని గ్రామాల్లో కూడా వందల సంఖ్యలో నిఖా సర్టిఫికేట్లు జారీ అవుతున్నట్లు పంచమహల్ జిల్లాలో గుర్తించామని.. ఇలాంటి అక్రమాలను అరికట్టడమే తమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.

సనాతన సంప్రదాయాల పరిరక్షణ
ప్రభుత్వం ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదని, కానీ మోసపూరిత, బలవంతపు పెళ్లిళ్లకు మాత్రమే వ్యతిరేకమని హర్ష్ సంఘ్వీ పేర్కొన్నారు. సనాతన సంప్రదాయాలను, సామాజిక కట్టుబాట్లను కాపాడటంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ముందు 30 రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+