Marriage: పెళ్లి కొడుకు, 30 రోజుల్లో రూ. 36 లక్షలు ?, ముగ్గురు భార్యలు, కన్నింగ్ రెహమాన్ !

చెన్నై/గోవా: భర్తతో విభేదాలు రావడంతో మహిళ అతనితో విడాకులు తీసుకుని ఒంటరిగా నివాసం ఉంటున్నది. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న మహిళకు సోషల్ మీడియాలో ఓవ్యక్తి పరిచయం అయ్యాడు. నా భార్య చనిపోయిందని ఆమెను నమ్మించాడు. తరువాత ఇద్దరు నేరుగా కలుసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. తరువాత కేటుగాడు ఖర్చుల కోసం ఆమె దగ్గర రూ. 60 వేలు తీసుకున్నాడు. తరువాత ఎకర భూమి కోర్టు వ్యవహారం తేల్చుకోవాలని ఆమెకు మాయమాటలు చెప్పాడు. 30 రోజుల్లో రూ. 36 లక్షలు ఆమె దగ్గర తీసుకున్న కిలాడీ ఎస్కేప్ అయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇప్పటికే ముగ్గురు భార్యలతో కాపురం చేస్తూ జల్సాలు చేస్తున్న కేటుగాడు గోవాకు వెళ్లి ఏం చేశాడు ? అని మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

 భర్తకు విడాకులు ఇచ్చింది

భర్తకు విడాకులు ఇచ్చింది

చెన్నైలోని తాంబరం సమీపంలోని మాడిచూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల మహిళ ఆమె భర్తతో విభేదాలు రావడంతో అతనితో విడాకులు తీసుకుని ఒంటరిగా నివాసం ఉంటున్నది. శ్రీమంతుల కుటుంబానికి చెందిన మహిళ భర్తకు దూరంగా ఉంటూ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంది.

మిస్టర్ 420

మిస్టర్ 420

రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న మహిళకు సోషల్ మీడియాలో హబీబ్ రెహమాన్ (38) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నా భార్య చనిపోయిందని, నేను ఒంటరిగా ఉంటున్నానని హబీబ్ రెహమాన్ ఆమెను నమ్మించాడు. తరువాత హబీబ్ రెహమాన్ ఆమెను నేరుగా కలుసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు.

 రూ. 60 వేలతో మొదలుపెట్టాడు

రూ. 60 వేలతో మొదలుపెట్టాడు

మహిళకు మాయమాటలు చెప్పిన రెహమాన్ తన దగ్గర డబ్బులు అయిపోయిందని, ఖర్చుల కోసం రూ. 60 వేలు ఇవ్వాలని ఆమెను మస్కా కొట్టి ఆ డబ్బు తీసుకున్నాడు. తరువాత తనకు ఒక ఎకర భూమి ఉందని, ఆ భూమి వ్యవహారం కోర్టులో విచారణలో ఉందని, ఆ భూమి మనకు సొంతం అయితే దానిని విక్రయిస్తే కోట్ల రూపాయల డబ్బులు వస్తుందని రెహమాన్ ఆమెను నమ్మించాడు.

 30 రోజుల్లో రూ. 36 లక్షలు స్వాహా

30 రోజుల్లో రూ. 36 లక్షలు స్వాహా

మహిళకు మాయమాటలు చెప్పిన రెహమాన్ ఆమె దగ్గర మొదట రూ. 10 లక్షలు తీసుకున్నాడు. కోర్టు ఫీజులు, వ్యవహారాలు అంటూ ఆమెను నమ్మించాడు. భూమి వ్యవహారం తేల్చుకోవాలని రెహమాన్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. 30 రోజుల్లో రూ. 36 లక్షలు ఆమె దగ్గర తీసుకున్న రెహమాన్ జల్సా చెయ్యడం మొదలు పెట్టాడు.

 మీరు చేసిన సహాయం ఈ జన్మలో మరిచిపోలేను

మీరు చేసిన సహాయం ఈ జన్మలో మరిచిపోలేను

మహిళ దగ్గర రూ. 36 లక్షలతో పాటు 13 సవర్ల బంగారు తీసుకున్న రెహమాన్ తరువాత ఆమెకు కనపడకుండా పోయాడు. మీరు చేసిన ఈ సహాయం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ ఆమెకు మెసేజ్ పంపించిన రెహమాన్ తరువాత అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రెహహాన్ కోసం మూడు నెలలుగా గాలించిన మహిళ విసిగిపోయి అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 గోవాలో మసాజ్ లు....... ఖరీదైన కారులో ?

గోవాలో మసాజ్ లు....... ఖరీదైన కారులో ?

రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు రెహమాన్ ను పట్టుకున్నారు. ఇప్పటికే ముగ్గురు భార్యలతో కాపురం చేస్తూ జల్సాలు చేస్తున్న రెహమాన్ మహిళ దగ్గర తీసుకున్న డబ్బుతో గోవాకు వెళ్లి మసాజ్ లో చేయించుకున్నాడని, పబ్ ల్లో ఎంజాయ్ చేశాడని అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడి నుంచి ఖరీదైన కారు, బంగారు నగలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+