భర్తను కలిసేందుకొస్తే..: ఆటోలో ఎత్తుకెళ్లి అడవుల్లో గ్యాంగ్ రేప్, అరెస్ట్

బరహంపూర్: ఒడిశాలోని గంజామ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం చెప్పారు. నలుగురు నిందితుల్లో ఓ ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు.

మహిళను అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారని, ఫిర్యాదు మేరకు నలుగురిని మంగళవారం నాడు అరెస్టు చేశామని చెప్పారు. బాధిత మహిళ నయాగర్ జిల్లా నుండి తన భర్తను కలిసేందుకు భంజానగర్ వచ్చిందని చెప్పారు. నిందితులను భంజనగర్ జైలుకు తరలించినట్లు చెప్పారు.

Married woman abducted and gang raped in Odisha

నిందితులను బదాలా ప్రధాన్ (30), ప్రశాంత ప్రణిగ్రతి (30), పట్నాయక్ (33), నారాయణ్ (30)గా గుర్తించారు. నారాయణ్ ఆటో డ్రైవర్. నలుగురు నిందితులు కూడా బెలగుతకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

బాధిత మహిళ ఆదివారం రోజు తన భర్తను కలిసేందుకు వచ్చిందన్నారు. ఆమె కుటుంబం చాలా పేదరికంది అని, దీంతో స్థానికంగా హోటల్‌లో ఉండేందుకు ఆమెకు డబ్బుల్లేవని, దీంతో భాంజా నగర్లోని ఆ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి పూట తలదాచుతుందని, ఆ మరుసటి రోజు తన భర్తను కలవాలనుకుందని పోలీసులు తెలిపారు.

సోమవారం ఉదయం ఆమెను ఆ నలుగురు కిడ్నాప్ చేశారని చెప్పారు. ఆటోలో ఆమెను కళింగ రోడ్డులోని ఓ అడవికి తీసుకు వెళ్లారని, అక్కడ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఆమెను బెలగుంత తీసుకు వెళ్తుండగా.. ఆమె ఆటోలో నుండి దూకి తప్పించుకుందని, స్థానికులు ఆమెను కాపాడారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+