
5సంవత్సరాల లోపు పిల్లలకు మాస్కులు సిఫార్సు చెయ్యలేదు: కేంద్రం సవరించిన మార్గదర్శకాలు
పిల్లలు మరియు 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న టీనేజర్లకు కోవిడ్ -19 నిర్వహణపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లలు మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్-19 నిర్వహణ కోసం సవరించిన సమగ్ర మార్గదర్శకాలలో, ఐదేళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాస్క్‌లు సిఫార్సు చేయబడవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

6 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ లోపు వయసు ఉన్న వారు మాస్కులు ధరించాలి
తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సురక్షితంగా మరియు తగిన విధంగా మాస్క్‌ను ఉపయోగించగల పిల్లలు సామర్థ్యాన్ని బట్టి 6-11 సంవత్సరాల వయస్సు గల వారు దానిని ధరించవచ్చునని స్పష్టం చేసింది. 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పెద్దల మాదిరిగానే మాస్క్ ధరించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రస్తుత కరోనా ఉప్పెనను దృష్టిలో ఉంచుకుని నిపుణుల బృందం మార్గదర్శకాలను సమీక్షించింది. ఇది ప్రధానంగా కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ ను దృష్టిలో పెట్టుకుని సమీక్ష జరిపింది. ఒమిక్రాన్ ఆందోళన కలిగించే వైవిధ్యం కావడంతో నిపుణుల బృందం దీనిపై ప్రధానంగా చర్చించింది.

యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్
ఉపయోగించటం సిఫార్సు చేయబడలేదు
కోవిడ్ ఇన్‌ఫెక్షన్ తీవ్రతతో సంబంధం లేకుండా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉపయోగించడం కూడా సిఫారసు చేయబడలేదని పేర్కొంది. స్టెరాయిడ్స్ వాడినట్లయితే, వైద్యపరమైన మెరుగుదలకి లోబడి 10 నుండి 14 రోజులలో వాటిని తగ్గించాలని ప్రభుత్వం తెలిపింది. ఇతర దేశాల నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వచ్చే వ్యాధి తక్కువ తీవ్రంగా ఉందని సూచిస్తుంది.
అయితే, ప్రస్తుత థర్డ్ వేవ్ అభివృద్ధి చెందుతున్నందున జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత కరోనా కేసులలో లక్షణరహిత, తేలికపాటి, మితమైన మరియు తీవ్రమైన కేసులను వర్గీకరించింది.

యాంటీమైక్రోబయాల్స్ వాడకంపై మార్గదర్శకాలు
పిల్లలు మరియు 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న టీనేజర్లకు కోవిడ్ -19 నిర్వహణపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు చూస్తే ఈ వయసు లోపు వారికి మార్గదర్శకాల ప్రకారం, కోవిడ్ -19 తీవ్రమైన సందర్భాల్లో, సూపర్‌యాడెడ్ ఇన్‌ఫెక్షన్‌పై క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీమైక్రోబయాల్స్ సూచించకూడదని మంత్రిత్వ శాఖ తెలిపింది. స్టెరాయిడ్‌లు సూచించబడవని మరియు కోవిడ్-19 యొక్క లక్షణం లేని మరియు తేలికపాటి సందర్భాల్లో హానికరమని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.కఠినమైన పర్యవేక్షణలో ఆసుపత్రిలో చేరిన తీవ్రమైన మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోవిడ్ -19 కేసులలో మాత్రమే ఇవి సూచించబడతాయని , మార్గదర్శకాలు పేర్కొన్నాయి.

రోజువారీ ప్రాతిపదికన క్లినికల్ అసెస్‌మెంట్ ప్రకారమే మందులు
స్టెరాయిడ్స్ సరైన సమయంలో, సరైన మోతాదులో మరియు సరైన వ్యవధిలో వాడాలని వారు పేర్కొన్నారు.డెక్సామెథాసోన్ 0.15 ఎంజీ , గరిష్ట మోతాదు ఆరు ఎంజీ రోజుకు ఒకసారి లేదా మిథైల్‌ప్రెడ్నిసోలోన్ 0.75 ఎంజీ, గరిష్ట మోతాదు 30 ఎంజీ రోజుకు ఒకసారి ఉపయోగించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో కార్టికోస్టెరాయిడ్స్‌ను ఉపయోగించవచ్చునని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. రోజువారీ ప్రాతిపదికన క్లినికల్ అసెస్‌మెంట్‌ను బట్టి వాటిని ఐదు నుండి ఏడు రోజులు కొనసాగించవచ్చు మరియు 10-14 రోజుల వరకు తగ్గించవచ్చు అని వారు పేర్కొన్నారు.

ఆసుపత్రిలో చేరే పిల్లలందరికీ థ్రాంబోసిస్ వచ్చే ప్రమాదం
ముఖ్యంగా పిల్లలలోనూ, టీనేజర్ల లోనూ లక్షణాలు ప్రారంభమైనప్పటి నుండి మొదటి మూడు నుండి ఐదు రోజులలో స్టెరాయిడ్లకు దూరంగా ఉండాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఆసుపత్రిలో చేరే పిల్లలందరికీ థ్రాంబోసిస్ వచ్చే ప్రమాదం ఉందని మరియు థ్రాంబోసిస్ అభివృద్ధి కోసం పర్యవేక్షించబడాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 అనంతర సంరక్షణ విషయానికొస్తే, లక్షణాలు లేని ఇన్‌ఫెక్షన్ లేదా తేలికపాటి వ్యాధి ఉన్న పిల్లలు సాధారణ పిల్లల సంరక్షణ, టీకా వయసు ఉంటే వారికి టీకా , పోషకాహార కౌన్సెలింగ్ మరియు ఫాలో అప్‌లో మానసిక మద్దతు ఇవ్వాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.

పిల్లల్లో శాసకోశ ఇబ్బందులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి
పైన పేర్కొన్న వాటితో పాటు, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే సమయంలో కోవిడ్‌తో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు పిల్లల్లో శ్వాసకోశ ఇబ్బందులను పర్యవేక్షించడం గురించి సలహా ఇవ్వాలి. పిల్లలను తిరిగి సదుపాయానికి తీసుకురావడానికి సూచనలను ఇవ్వాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఆసుపత్రిలో ఉన్న సమయంలో లేదా ఆ తర్వాత ఏదైనా అవయవం నిర్దిష్టంగా పనిచేయకపోవడం సమస్యగా ఉన్న పిల్లలు తగిన సంరక్షణను పొందాలని వారు చెప్పారు.