పాకిస్తాన్ ను డీప్ ఫ్రై చేసిన భారత్

భారత వైమానిక దళానికి చెందిన ఓ డిన్నర్ మెనూ కార్డ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఐఏఎఫ్ 93వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన మెనూ కార్డ్ ఇది. ఇందులో పాకిస్తాన్ వైమానిక స్థావరాల పేర్లతో కూడిన వంటకాల వివరాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ధ్వంసం చేసిన ఎయిర్ బేస్ స్టేషన్లే అవన్నీ కూడా.

'రావల్పిండి' చికెన్ టిక్కా మసాలా, 'రఫీకి' రారా మటన్, 'భోలారి' పనీర్ మేతి మలై, 'సుక్కూర్' షామ్ సవేరా కోఫ్తా, 'సర్గోధా' దాల్ మఖానీ, 'జాకొబాబాద్' మేవా పులావ్, 'బహావల్‌ పూర్' నాన్ వంటి వంటకాలు ఈ మెనూలో ఉన్నాయి. 'బాలాకోట్' టిరామిసు, 'ముజఫరాబాద్' కుల్ఫీ ఫలూదా, 'మురిద్కే' మీఠా పాన్ వంటివి డెజర్ట్‌లో కనిపించాయి. ప్రతి పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ ను కూడా ఇందులో పొందుపరిచారు.

Mass Trolling On Pakistan by IAF Dinner Menu at Ceremony Goes Viral

2019లో జరిగిన ఆపరేషన్ బందర్, ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్ వంటి భారత వైమానిక దాడుల్లో ధ్వంసం అయ్యాయి. 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై ఆపరేషన్ బందర్ పేరుతో భారత్ వైమానిక దాడిని నిర్వహించిన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఎదురుదాడి చేపట్టింది. ఏడు మిరాజ్ 2000 విమానాలతో బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా, భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ నియంత్రణలోని ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై మూకుమ్మడి దాడి చేపట్టింది. దాదాపుగా 20 శాతానికి పైగా పాకిస్తాన్ వైమానిక ఆస్తులను ధ్వంసం చేసింది. ఐఎఎఫ్ తాజా మెనూ కార్డ్ ను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన "నయా భారత్" ఇదే నని కామెంట్స్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+