2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు తొలగింపు.. UIDAI సంచలనం..!

భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూఐడీఏఐ తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఈ క్రైమ్స్ మాత్రం ఆగడం లేదు.. ఇటీవలికాలంలో విపరీతంగా వాడుకలోకి వచ్చిన ఏఐ ను కూడా వినియోగించి నకిలీ ఆధార్, పాన్ కార్డులను సైతం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్ లో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు సులభంగా వినియోగించేలా మరికొన్ని మార్పులను ప్రవేశపెట్టనుంది భారత విశిష్ట యూఐడీఏఐ.. కొత్తగా యాప్​ అలాగే ఫేసియల్​ అథెంటికేషన్ ను తీసుకురానుంది.

అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు చెందిన 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేసినట్లు యూఐడీఏఐ తెలిపింది. భారత రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర అలాగే పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన మరణాల నమోదు డేటాను ఆధారంగా తీసుకుని.. ఇతర డేటాతో ఆధార్ రికార్డులను సరిపోల్చిన తర్వాత యూఐడీఏఐ చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను డీయాక్టివేషన్‌ చేసినట్లు స్పష్టం అవుతోంది.

Massive Cleanup UIDAI Wipes Out Over 2 Crore Duplicate Aadhaar Numbers

ఇక ఈ డీయాక్టివేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2024లోనే ప్రారంభించింది. ఈ ఏడాది జులై నాటికే దాదాపు 1 కోటీ 17 లక్షల ఆధార్ నంబర్లను యూఐడీఏఐ డీయాక్టివేట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సంఖ్య కోటీ 40 లక్షలకు చేరింది. ఇక తాజాగా కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2025 నవంబర్ 26 నాటికి దేశంలో 2 కోట్ల ఆధార్ నంబర్లను యూఐడీఏఐ డీయాక్టివేట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+