ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. 30 ఫైరింజన్ల మోహరింపు..
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిక్రీ బోర్డర్ ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో బుధవారం తెల్లవారుజామున 2.50గంటలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో.. వాటిని ఆర్పేందుకు 30 ఫైరింజన్స్ అక్కడికి చేరుకున్నాయి.

Recommended Video
గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే బోయింగ్ విమానంలో మంటలు : వీడియో వైరల్
కొద్దిగంటలుగా అవిరామంగా శ్రమిస్తున్నా.. మంటలు అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరగవచ్చునని భావిస్తున్నప్పటికీ.. స్పష్టమైన కారణాలేవీ తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications