తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం: భయంతో బయటకు దూకేసిన ప్రయాణికులు
ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తాజ్ ఎక్స్‌ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలులోని నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయంతో రైలు నుంచి బయటకు దూకేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుంది.
రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం యంత్రం 4.41 గంటలకు రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. అనంతరం ఐఓ అపోలో ఆస్పత్రి సమీపంలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని నాలుగు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నట్లు ఘటనా స్థలంలో కనిపించింది. దీంతో రైలు ఆగిపోయింది.

ప్రయాణికులు ఇతర కోచ్‌లకు వెళ్లడం, రైలు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం మంటలను ఆర్పివేశారు. రైల్వేశాఖ తదుపరి చర్యలు తీసుకుంటోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తుగ్లకాబాద్ నుంచి ఓక్లా వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
#WATCH | Delhi: Fire being extinguished by firefighters after two coaches of Taj Express caught fire between Tughlakabad-Okhla. All passengers are safe
— ANI (@ANI) June 3, 2024
(Source: Delhi Fire Service) https://t.co/xo2NiT2BSw pic.twitter.com/NEcBkY2w5b
మరోవైపు, ఆదివారం పంజాబ్ రాష్ట్రంలో ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని మాధోపూర్, సిర్హింద్ సమీపంలో రెండు రైల్వే గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో తెల్లవారుజామున 3:30 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత గూడ్స్ రైలు ఇంజిన్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లకు గాయాలయ్యాయి. ఇద్దరు లోకో పైలట్లను శ్రీ ఫతేగర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో పాటియాలాలోని రాజిందర్ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications