ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: మంటలార్పిన 33 ఫైరింజన్లు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంద్కా ప్రాంతంలోని ఓపాస్టిక్ తుక్కు దుకాణం(స్క్రాప్ మార్కెట్)లో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. 33 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశాయి.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ముండ్కా ప్రాంతంలోని ప్లాస్టిక్ తుక్కు దుకాణ సముదాయం ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది.












Click it and Unblock the Notifications