కొత్త ఏడాదిలో కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్..! 8వ వేతన సంఘంపై..!
కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం నివేదిక 18 నెలల్లో అంటే 2027 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ 18 నెలల తర్వాత పెరిగే జీతాలు, పెన్షన్లను 2026 జనవరి 1 నుంచి వర్తింపచేయబోతున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. 7వ వేతన సంఘం పదవీకాలం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) నవంబర్ లోనే నియమించారు. అలాగే సిఫార్సుల కోసం 18 నెలల గడువు కూడా ఇచ్చారు. అయితే దీనిపై ముందే ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం నివేదిక 18 నెలల్లో అంటే 2027 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ 18 నెలల తర్వాత పెరిగే జీతాలు, పెన్షన్లను 2026 జనవరి 1 నుంచి వర్తింపచేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఉద్యోగులకు పెరిగిన వాస్తవ జీతాల చెల్లింపులు ఆలస్యమైనా, బకాయిలు మాత్రం ఈ అమలు తేదీ నుంచే లెక్కించి అకౌంట్లలో జమ చేస్తారు.

గతంలో 2016 జనవరి నుంచి జీతాలు సవరించగా.. జూన్ లో కేబినెట్ ఆమోదం తర్వాత బకాయిలతో కలిపి చెల్లించారు. ఈసారి కూడా అలాగే ముందుగానే జీతాల పెంపుపై ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. అనంతరం కేబినెట్ ఆమోదం, ఇతర లాంఛనాలు పూర్తి చేసి 2027లో బకాయిలతో కలిపి చెల్లించే అవకాశముంది. ఉద్యోగులు 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీతాల పెంపు ఆశించవచ్చని నిపుణులు చెప్తున్నారు.

అలాగే గతాన్ని గమనిస్తే 6వ వేతన సంఘం సగటున 40% జీతాలు పెంచింది. 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో 23-25% పెంపుకు సిఫార్సు చేసింది.ఇప్పుడు 8వ వేతన సంఘం 20% నుండి 35% వరకు జీతాల పెంపు సిఫార్సు చేస్తుందని అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.4 నుండి 3.0 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు మూల వేతనాల పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగులకు కూడా మంచి పెంపు ఉంటుందనే అంచనాలున్నాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications