'పాకిస్తాన్ కాదు పాపిస్తాన్, ఇండియాలో ఆశారాం, అక్కడ హఫీజ్'
లక్నో: పాకిస్తాన్ దేశం పైన షియా మతపెద్ద ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. షియా మతపెద్ద, ఆల్ ఇండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్ ఓ సందర్భంలో పాకిస్తాన్ పైన నిప్పులు చెరిగారు. పాకిస్తాన్‌ను ఆ పేరుతో పిలవడం కంటే పాపిస్తాన్ అని పిలవడం మంచిదన్నారు.
ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో ఎందరో అమాయకులను బలితీసుకుంటున్నారని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ తీరు చూస్తుంటే ఏమాత్రం సరిగా లేదని అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్‌లో ఎందరో అమాయకులను నిత్యం చంపుతున్నందున దానిని పాపిస్తాన్ అనవచ్చునని అన్నారు. ఎప్పుడైతే మానవత్వం సిక్ అయి కూర్చుంటుందో అలాంటి సమయంలో భారత దేశంలో ఆశారాం బాపు వంటి వారు, పాక్‌లో హఫీజ్ సయీద్, ముల్లా ఓమర్ వంటి వారు పుట్టుకొస్తారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications