మాయావతి అనూహ్యం: బీఎస్పీ నుంచి ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ -గెంటేసినా ఉంటామంటూ..

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకుని, ఇంకొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోన్న బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సొంత పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేశారనే ఆరోపణలపై సదరు నేతలను అధినేత్రి మాయావతి గెంటేయగా.. వారు మాత్రం పార్టీలోనే ఉంటామంటూ ప్రకటనలు చేశారు..

ఇటీవల జరిగిన యూపీ పంచాయితీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) శాసన సభాపక్ష నేత సహా ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధిష్టానం గురువారం బహిష్కరణ వేటు వేసింది. ఈ మేరకు మాయావతి కార్యాలయం, పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటనలు చేశాయి.

 Mayawati expels 2 senior BSP MLAs For Anti-Party Activities During UP Panchayat Polls

యూపీ అసెంబ్లీలో బీఎస్పీఎల్పీ నేతగా ఉన్న లాల్జీ వర్మ, ఎమ్మెల్యే రామ్ అచల్ రాజ్భర్‌ ఇద్దరూ ఇకపై బీఎస్పీ సభ్యులు కాబోరని, వారిపై వేటేశామని, పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు..

ఈ ఇద్దర్నీ ఇకపై ఎలాంటి పార్టీ కార్యక్రమాలకూ ఆహ్వానించబోమనీ... వారికి ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వబోమని బీఎస్పీ స్పష్టం చేసింది. పార్టీ శాసన సభాపక్ష నేతగా వర్మ స్థానంలో షా ఆలం అలియాస్ గుడ్డు జమలిని నియమిస్తున్నట్టు తెలిపింది. అయితే అంబేద్కర్ నగర్ జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇరువురు ఎమ్మెల్యేలు తాము పార్టీలోనే కొనసాగుతామంటూ ప్రకటించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+